మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వి
Last Modified: బుధవారం, 7 అక్టోబరు 2020 (19:44 IST)

చిన్నమ్మ శశికళకు షాక్, రూ.2 వేల కోట్లను అటాచ్ చేసిన ఐటీ శాఖ

తమిళనాడులో జయలలిత హయాంలో చిన్నమ్మ పేరిట తెర వెనుక శక్తిగా పెరిగిన శశికళ ఇప్పుడు కష్టాల సుడిగుండంలో పడింది. తాజాగా శశికళకు ఐటీ శాఖ భారీ షాకిచ్చింది. మరికొన్నాళ్లలో జైలు నుంచి విడుదల కానున్న శశికళ మళ్లీ రాజకీయంలో తనదైన రీతిలో హవా సాగించాలని భావించారు.
 
అయితే ఆమెకు చెందిన రూ.2 వేల కోట్ల విలువైన ఆస్తిని అటాచ్ చేయడం ద్వారా ఐటీ శాఖ ఆమె ఆశలపై నీళ్లు చల్లింది. శశికళకు చెందిన ఈ ఆస్తులను బినామీ నిరోధక చట్టం కింద ఐటీ అధికారులు స్తంభింపజేశారు. ప్రస్తుతం బెంగళూరు పరప్పన జైలులో ఉన్న శశికళకు ఈ మేరకు నోటీసులు పంపారు.
 
కాగా అటాచ్ చేసిన ఆస్తులలో కొడనాడు సిరతాపూర్ ప్రాంతాలలో ఆమెకు రెండు ఆస్తులు ఉండగా అవి రెండూ శశికళ పేరిటే ఉన్నాయి. ఇవే కాకుండా అనేక ఆస్తులను గతంలోనే గుర్తించిన ఐటీ శాఖ తన దర్యాప్తులో వాటిని నిర్ధారించుకుంది. ఈ క్రమంలోనే అటాచ్ చేసింది.