భార్యతో బెడ్ పైన ప్రాణ స్నేహితుడు, తలుపు గడియపెట్టి ఆ పని చేశాడు

Affair
జె| Last Modified శనివారం, 2 జనవరి 2021 (16:19 IST)
వారిద్దరు ప్రాణస్నేహితులు. ఒకరంటే ఒకరికి ప్రాణం. ఎలాంటి సమస్య వచ్చినా సరే ఇద్దరూ కలిసి ఎదుర్కొంటారు. ఒకరి ఇంటికి మరొకరు తరచూ వచ్చి వెళ్ళేవారు. వీరి స్నేహం అంటే ఆ ప్రాంతంలో ఉన్న వారికి అసూయ. ఇలాంటి స్నేహం కూడా ఉంటుందా అనుకునేవారు. కానీ అలాంటి స్నేహితులు బద్ధశత్రువులుగా మారిపోయారు. ఒకరినొకరు చంపుకునేంత పరిస్థితికి తెచ్చుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?

చెన్నైలోని ఎంజీఆర్ గనర్ వీధిలో నివాసముండే సెంథిల్ వేల్, లక్ష్మిలు భార్యాభర్తలు. వీరికి 13 యేళ్ళ క్రితం వివాహమైంది. స్థానికంగా సెలూన్ షాపు నడిపేవాడు సెంథిల్ వేల్. అయితే సెంథిల్‌కు చిన్ననాటి స్నేహితుడు ఉన్నాడు. అతని పేరు గోవిందస్వామి. ఇద్దరూ ప్రాణ స్నేహితులు.

వివాహమైనా సరే ఇద్దరి స్నేహం అలాగే కొనసాగింది. ఇద్దరూ ప్రాణస్నేహితులుగా కొనసాగుతూ వస్తున్నారు. గోవిందస్వామి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. పెళ్ళయినా సరే లక్ష్మికి పిల్లలు లేరు. పిల్లల కోసం వారు వెళ్ళని ఆలయాలు కూడా లేవు. సెంథిల్ ఇంటికి గోవిందస్వామి వెళ్ళేవాడు. అలాగే గోవిందస్వామి ఇంటికి సెంథిల్ వచ్చేవాడు. గోవిందస్వామికి వివాహం కాలేదు.

సెంథిల్ ఇంట్లో లేని సమయంలో కూడా గోవిందస్వామి ఇంటికి వచ్చి వెళుతుండేవాడు. దీంతో ఈ పరిచయం కాస్త గోవిందస్వామి, లక్ష్మిలకు మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం కాస్త సెంథిల్‌కు తెలిసింది. భార్యను చితకబాదాడు. అయినా ఆమె మారలేదు.

దీంతో మద్యానికి బానిసైన సెంథిల్ కుమార్ ఫుల్లుగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఇంట్లో లేకపోవడంతో నేరుగా గోవిందస్వామి ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఇద్దరు ఏకాంతంగా ఉండటంతో కిరోసిన్ డబ్బా తీసుకెళ్ళి కిటికీ నుంచి కిరోసిన్ పోసి తలుపులకు గడియపెట్టి నిప్పంటించాడు.

గట్టిగా అరుపులు, కేకలు వినిపించడంతో స్థానికులు అక్కడికి వచ్చారు. అయితే అప్పటికే లక్ష్మి చనిపోయింది. 70 శాతానికి పైగా శరీరం కాలిపోయి గోవిందస్వామి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. అతడిని ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :