యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆరోగ్యం విషమం
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిష్ట్ ఆరోగ్యం విషమించింది. అసలే వృద్దాప్య సమస్యలతో పాటు కిడ్నీ, కాలేయ సమస్యలు వేధిస్తున్నాయి. దీంతో ఆయనను మార్చి 13వ తేదీన ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్‌లో చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు.
ఆయనకు గ్యాస్ట్రో విభాగానికి చెందిన డాక్టర్ వినీత్ అహుజా బృందం అతనికి చికిత్స అందిస్తోంది. అయితే, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగా విషమించినట్టు ఆస్పత్రి వర్గాల సమాచారం. కాగా, యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ ఉత్తరాఖండ్‌లోని యమకేశ్వర్‌లోని పంచూర్ గ్రామంలో నివసిస్తున్నారు. 1991లో ఉత్తరాఖండ్‌లో ఫారెస్ట్ రేంజర్‌గా పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన ఆ గ్రామంలోనే ఉంటున్నారు.