శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2015 (14:04 IST)

మన్మోహన్ అభ్యర్థనను మన్నించిన సుప్రీంకోర్టు.. ఊరట...

బొగ్గు కుంభకోణంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేసుకున్న అభ్యర్థనను దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు మన్నించింది. బొగ్గు స్కామ్‌లో కోర్టుకు హాజరుకావాలంటూ తనకు జారీ చేసిన సమన్లను రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటీషన్‌ను విచారించిన అపెక్స్ కోర్టు.. సీబీఐ ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్లపై స్టే విధించింది. 
 
బొగ్గు కుంభకోణం వ్యవహారంలో తనకు ప్రమేయం లేదని మాజీ ప్రధాని మన్మోహన్‌ పెట్టుకున్న అభ్యర్థనపై సుప్రీం ఈ విధంగా స్పందించింది. మరో నాలుగు వారాల తర్వాత ఈ కేసుకు సంబంధించిన విచారణను చేపట్టనున్నట్లు సుప్రీం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.
 
దీంతో మన్మోహన్‌ సింగ్‌తో పాటు మరో ఐదుగురిపై ఈ కేసులో విచారణను నిలిపివేయాలని సుప్రీం ఆదేశించింది. సీబీఐ కోర్టు జారీ చేసిన సమన్లపై ఉన్నతన్యాయస్థానం స్టే విధించింది.