ఆ పాముకు నీళ్ల దాహం వేసిందో ఏమో కానీ.. బీరు క్యానులో..?
ఆ పాముకు నీళ్ల దాహం వేసిందో ఏమో కానీ.. దాని కంటికి కనిపించిన ఖాళీ బీర్ క్యానులో నోరుపెట్టింది. అంతే ఖాళీ బీర్ క్యానులో తల చిక్కుకుపోయింది. దీంతో ఆ నాగరాజుకు చుక్కలు కనిపించాయి. ఈ ఘటన ఒడిశాలోని పూరీ జిల్లా బొలొంగొ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధంచిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. ఎవరో బీర్ క్యాన్ తాగి చెట్ల పొదల మధ్య పడేయగా అందులో నాగుపాము తలదూర్చింది. మళ్లీ బయటకు రాలేకపోయింది. జితేంద్ర మహాపాత్రొ పెరటిలో ఖాళీ బీర్ క్యాన్‌లో పాము ఉన్న విషయాన్ని గుర్తించిన స్థానికులు ఆ పామును రక్షించడానికి ప్రయత్నించారు.
స్థానికులు స్నేక్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న హెల్ప్‌లైన్ సభ్యుడు సుశాంత కుమార్ బీర్ క్యాన్‌ను కట్ చేశాడు. నాగుపాము గాయపడకుండా అందులోంచి బయటకు తీసి అటవీ ప్రాంతంలో విడిచి పెట్టాడు.