ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2020 (22:25 IST)

ప్రేమ పేరుతో ప్రియుడితో పరార్.. పోలీసులు వెతికి పట్టుకున్నారు.. కానీ?

ప్రేమ పేరుతో ప్రియుడితో పారిపోయింది. తిరిగి వచ్చేసరికి కుమార్తె కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరుకు చెందిన 23 ఏళ్ల ఓ యువకుడు స్థానికంగా ఉన్న ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే, అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. 
 
ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో హెచ్చరించారు. అయినప్పటికీ యువతి వినకపోవడంతో పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. తగిన వరుడిని మాట్లాడేందుకు కోయంబత్తూరు నుంచి పళని వెళ్లారు. తల్లిదండ్రులు బయట ఊరికి వెళ్లడంతో యువతి, ప్రియుడితో కలిసి వెళ్ళిపోయింది. దీంతో తల్లిదండ్రులు కేసు పెట్టారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు యువకుడిని వెతికి పట్టుకున్నారు.
 
యువతి మైనర్ కావడం, మైనర్ బాలికపై యువకుడు పలుమార్లు లైంగిక దాడి చేయడంతో పోలీసులు ఫోక్సో కేసుకు కింద కేసు నమోదు చేశారు. తల్లిదండ్రులతో కలిసి ఉండేందుకు యువతి అంగీకరించకపోవడంతో ఆ యువతిని షెల్టర్ హోమ్‌కు తరలించారు.