Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రాహుల్ గాంధీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. తాళాలు మా చేతికి వచ్చాయి..

గురువారం, 1 డిశెంబరు 2016 (11:10 IST)

Widgets Magazine
rahul gandhi

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. అయితే ఎవరు హ్యాక్ చేశారనేది తెలియరాలేదు. అయితే రాహుల్ అకౌంట్ హ్యాక్ అవడంపై కాంగ్రెస్ పార్టీ ఫైర్ అవుతోంది. ఈ చర్య ముమ్మాటికీ దిగజారుడు చర్య అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుర్జేవాలా విమర్శించారు. రాహుల్ గాంధీ పేదల స్వరంగా మారినందుకే ఇలా చేశారని ఆరోపించారు. 
 
రాహుల్ గాంధీకి ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసి అభ్యంతరకర వ్యాఖ్యలు పెట్టారు. ''కాంగ్రెస్ పార్టీ ఈమెయిళ్లన్నీ బయటికి తెస్తున్నాం... క్రిస్మస్ స్పెషల్ కోసం చూస్తూనే ఉండండి'' అని హ్యాకర్లు పోస్టు చేశారు. దీంతోపాటు రాహుల్ గాంధీ ఎకౌంట్‌ను గురువారం మళ్లీ హ్యాక్ చేశారు. ఆయన ఖాతానుంచి ఉదయం 10:30కి సమయంలో మళ్లీ పోస్టులు పెట్టారు. దేశంలో డిజిటల్ సెక్యూరిటీ ప్రశ్నార్థకంగా మారిందనడానికి ఇదే నిదర్శనమని రాహుల్ గాంధీ విమర్శించారు.
 
దాదాపు 12 లక్షల మంది ఉన్న ఆయన ట్విట్టర్ ఖాతా నుంచి బుధవారం వరుసగా హ్యాకర్లు అభ్యంతరకర మెసేజ్‌లు పోస్టు చేసి కలకలం సృష్టించారు. ఓ ట్వీట్ ఆధారంగా ఈ హ్యాకింగ్‌కు పాల్పడిన వారిని 'లెజియన్' గ్రూప్‌గా అనుమానిస్తున్నారు. హ్యాకర్లపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ''వారి తాళాలు మా చేతికి వచ్చాయి. మీరు నిజంగానే కేసు పెడదామనుకుంటున్నారా, హాఁ?'' అని హ్యాకర్లు ట్వీట్ చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పాకిస్థాన్.. ఫెంటాస్టిక్ ప్లేస్.. ఫెంటాస్టిక్ పీపుల్.. డోనాల్డ్ ట్రంప్ ట్వీట్ :: షరీఫ్‌ ఫోన్

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాకిస్థాన్‌పై నిప్పులు చెరిగిన డొనాల్డ్‌ అధ్యక్షుడు ...

news

ఖాకీ కర్కశత్వం : ఏటీఎంలో 2 కార్డులు వాడినందుకు చేయి విరగ్గొట్టారు

ఖాకీలు తమలోని కర్కశత్వాన్ని మరోమారు ప్రదర్శించారు. ఓ కానిస్టేబుల్ ప్రయోగించిన లాఠీ ...

news

కోల్‌కతా వైద్యుడి వద్ద రూ.10 లక్షల కొత్త కరెన్సీ నోట్లు..

దేశ వ్యాప్తంగా కరెన్సీ కష్టాలు తారా స్థాయిలో ఉన్నాయి. కొత్త నోట్లతో పాటు.. చిల్లర కోసం ...

news

తిరుచ్చిలో భారీ అగ్నిప్రమాదం.. 20 మంది సజీవదహనం

తమిళనాడు రాష్ట్రంలో పేలుడు సంభవించింది. మందుగుండు గోడౌన్‌లో ఈ పేలుడు సంభవించింది. ...

Widgets Magazine