శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి

అత్యాచారానికిగురై గర్భందాల్చి మైనర్ బాలిక... గర్భవిచ్ఛిత్తి ఆ యువతి ఇష్టమన్న అలహాబాద్ హైకోర్టు

Pregnancy
గుజరాత్ రాష్ట్రంలో 15 యేళ్ల బాలిక అత్యాచారానికి గురై గర్భందాల్చింది. దాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆ బాలిక అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. గర్భవిచ్ఛిత్తి వల్ల బాలిక ప్రాణాలకు ముప్పు ఉందని వైద్యులు కూడా స్పష్టం చేశారు. దీంతో కోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. గర్భాన్ని ఉంచుకోవాలా? తొలగించుకోవాలా? అనేది ఆ బాలిక ఇష్టమని పేర్కొంది. 
 
బాధిత బాలిక తన గర్భాన్ని కొనసాగించి, పుట్టే బిడ్డను దత్తకు ఇవ్వాలనుకుంటే అలాగే చేయొచ్చని, అయితే, ఈ విషయాన్ని వీలైనంత ప్రైవేటుగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. గర్భ విచ్ఛిత్తివల్ల ప్రమాదం పొంచివుందన్న వైద్యుల కౌన్సెలింగ్‌‍ తర్వాత బాలిక, ఆమె తల్లిదండ్రులు గర్భాన్ని తొలగించాలని నిర్ణయించుకున్నారు. 
 
ఆమె తన గర్భాన్ని తొలగించుకోవాలా వద్దా అన్న నిర్ణయాన్ని ఆమె తప్ప మరెవరూ తీసుకోకూడదని కోర్టు అభిప్రాయపడింది అని అలహాబాద్ కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శేఖర్ బీ సరఫ్, జస్టిస్ మంజీవ్ శుక్లాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.