Widgets Magazine

పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ ఓవర్.. ఏమిస్తావని.. కౌగిలించుకోమన్నాడు..

గురువారం, 12 జులై 2018 (18:57 IST)

ఓ మహిళా జర్నలిస్టుకు చేదు అనుభవం ఎదురైంది. పాస్ పోర్టు వెరిఫికేషన్ కోసం వచ్చిన పోలీసు జర్నలిస్టు పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడు ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్‌కు వచ్చిన ఓ పోలీసు అధికారి.. ఒంటరిగా ఉన్న మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. వెరిఫికేషన్‌ చేసినందుకు బదులుగా కౌగిలించుకోమన్నాడు. 
 
ఓ ప్రముఖ వార్తా సంస్థలో జర్నలిస్టుగా పనిచేస్తున్న శ్వేతా గోస్వామి అనే మహిళకు ఈ చేదు అనుభవం ఎదురైంది. దీంతో ఆమె ట్విటర్‌ వేదికగా ఈ విషయాన్ని కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, సుష్మాస్వరాజ్‌, ఘజియాబాద్‌ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వరుస ట్వీట్లతో తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ట్వీట్‌లో మహిళలకు భద్రత లేకుండా పోయిందని సదరు మహిళా జర్నలిస్టు మండిపడ్డారు. 
 
వెరిఫికేషన్‌ కోసం ఇంటికొచ్చి.. అవకాశం కోసం ఎదురుచూశాడు. మా ఇంట చాలాసేపు గడిపేందుకు ప్రయత్నించాడు. చివరికి వెరిఫికేషన్ పూర్తి చేశాను. తనకేం ఇస్తావని అడిగాడు. ఇంకా కౌగిలింత కావాలన్నాడు. ఆ పోలీస్ పేరు దేవేరంద్ర సింగ్ అంటూ సదరు మహిళా జర్నలిస్టు ట్వీట్ చేశారు. ఇక వేధింపులకు గురైన మహిళా జర్నలిస్టుకు మద్దతు పెరుగుతోంది. ఆమెను వేధించిన పోలీసుపై చర్యలు తీసుకోవాలని వారు నెట్టింట డిమాండ్ చేస్తున్నారు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

భర్త లేడు.. గ్యాస్ స్టౌవ్ మెకానిక్‌తో ఆ సంబంధం.. తండ్రి అడ్డు తగిలాడని?

మానవీయ విలువలు, అనుబంధాలు మంటగలిసిపోతున్నాయి. సోషల్ మీడియా, స్మార్ట్‌ఫోన్ల ప్రభావంతో ...

news

అతడు ఉరి వేసుకుంటుంటే 2,750 మంది చూస్తూ వున్నారు... కానీ ఎవ్వరూ ఆపలేదు...

ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమ్ చేస్తూ దారుణాలకు ఒడిగట్టడం ఎక్కువవుతోంది. ...

news

చినబాబుపై చిర్రుబుర్రుమంటున్న టీజీ ఫ్యామిలీ... వేరే పార్టీలోకి జంప్?

ఏపీ మంత్రి నారా లోకేష్‌ తీరుపై టీజీ ఫ్యామిలీ మండిపడుతోందట. పార్టీలో వున్న వారిని కాదని ...

news

మరో రెండు రోజుల్లో శ్రీరెడ్డికి అదేగతి.. ఏంటది?

శ్రీరాముడు, సీతపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ ను హైదరాబాద్ నగరం నుంచి ...

Widgets Magazine