సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 మే 2020 (10:30 IST)

దేశంలో విజృంభిస్తున్న కరోనా.. ఏపీలో 24 గంటల్లోనే 62మందికి కోవిడ్

భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. భారత్‌లో ఇప్పటి వరకూ 1,25,101 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 69,597 ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకూ 3,720 మంది కరోనా కారణంగా మృతి చెందారు. 51,784 మంది కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నారు. మహారాష్ట్ర, గుజారాత్, ఢిల్లీ, తమిళనాడుల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి.
 
ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. కేవలం 24 గంటల్లోనే కొత్తగా 62 మందికి కరోనా సోకింది. ఏపీ ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం.. నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈ రోజు ఉదయం 9 గంటల వరకు 8,415 శాంపిల్స్‌ను పరీక్షించారు. అందులో తాజా కేసులు బయటపడ్డాయి. అటు.. రోజు వ్యవధిలో 51 మంది కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారు. 
 
ఇదిలా ఉండగా, వ్యాధి తీవ్రత ఎక్కువై కృష్ణా జిల్లాలో ఒక వ్యక్తి మరణించాడు. మొత్తం మరణించిన వారి సంఖ్య 55కు చేరింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 2514 పాజిటివ్ కేసులకు గాను 1731 మంది డిశ్చార్జి కాగా ప్రస్తుతం 728 మంది చికిత్స పొందుతున్నారు.