శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 22 ఏప్రియల్ 2020 (20:46 IST)

కరోనా ఎఫెక్ట్‌ : ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్ర రద్దు

అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లాలనుకునే ఔత్సాహికులకు దుర్వార్త! అమర్‌నాథ్‌ యాత్ర ఈ ఏడాది రద్దయింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమర్‌నాథ్‌ బోర్డు బుధవారం ప్రకటించింది.

గత ఏడాది జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్‌ 370 రద్దుతో అమర్‌నాథ్‌ యాత్ర నుంచి యాత్రికులు తమ పర్యటనను కుదించుకుని వెనుతిరిగారు. కాగా, కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది యాత్రను రద్దు చేస్తున్నట్టు బోర్డు ప్రకటించింది. 

అప్పన్న చందనోత్సవం యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం
విశాఖపట్టణం జిల్లాలోని సింహాద్రి అప్పన్న చందనోత్సావానికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి.

నరసింహస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించాల్సిందిగా దేవస్థానం ఈవోను ఆదేశించింది. ఈ వేడుకలకు ఎవరూ కుటుంబసభ్యులతో వెళ్లొద్దని ప్రభుత్వం ఆదేశించింది.

ప్రజలు, వీఐపీలను ఆహ్వానించవద్దని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. చందనోత్సవాన్ని యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయమని ప్రభుత్వం సూచించింది.