శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 9 జూన్ 2020 (09:41 IST)

ఎన్డీఆర్ఎఫ్ లో కరోనా కలకలం

జాతీయ విపత్తు ప్రతిస్పందన దళానికి చెందిన(ఎన్డీఆర్ఎఫ్) లో కరోనా కలకలం రేపుతోంది. ‘ఆంఫన్’ తుపాన్ సహాయ పునరావాస పనులు చేస్తున్న 50 మంది సభ్యులకు కరోనా వైరస్ సోకడం తీవ్ర ఆందోళన రేపుతోంది.

‘ఆంఫన్’ తుపాన్ అనంతరం ఎన్డీఆర్ఎఫ్ జవాన్లు పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టారు.

కటక్, భువనేశ్వర్ ప్రాంతాల్లో సహాయ పనులు చేసిన 170 మంది ఎన్డీఆర్ఎఫ్ జవాన్లకు కరోనా పరీక్షలు చేయగా వారిలో 50 మందికి పాజిటివ్ అని వచ్చింది. దీంతోపాటు దేశంలో మరో 24 మంది ఎన్డీఆర్ఎఫ్ జవాన్లు  కరోనా బారిన పడ్డారు. 

దీంతో కరోనా సోకిన ఎన్డీఆర్ఎఫ్ జవాన్లను ఆసుపత్రికి తరలించారు. దీనిపై అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. అందరికీ పరీక్షలు చేయాలని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు నిర్ణయించారు.