శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 జూన్ 2020 (17:49 IST)

పెళ్లైన మరుసటి రోజే కోవిడ్‌తో వరుడి మృతి.. పెళ్లికి హాజరైన 31మందికి కరోనా

వివాహమైన మరుసటి రోజే బీహార్‌లో వరుడు ప్రాణాలు కోల్పోయాడు. కరోనా కారణంగా వరుడు మృతి చెందడంతో పెళ్లికి హాజరైన 31మందికి కరోనా సోకిందని వైద్యులు నిర్ధారించారు. వివరాల్లోకి వెళితే.. పాట్నా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన వరుడు.. హర్యానా, గుర్గావ్‌లో పనిచేస్తున్నాడు. గత జూన్ 15వ తేదీ వివాహం కోసం గుర్గావ్ నుంచి నవుబద్భూర్ ప్రాంతానికి చేరుకున్నాడు. 
 
వివాహం కూడా ముగిసింది. వివాహం జరిగిన మరుసటి రోజు వరుడు అనారోగ్యం కారణంగా పాట్నాలోని ఆస్పత్రిలో చేరాడు. అయితే అతనికి ఆరోగ్య పరిస్థితి విషమంగా వున్న కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. వరుడి మృతిపై జరిపిన విచారణ జరిగింది. 
 
ఇంకా టెస్టుల్లో వరుడికి కరోనా సోకిందని తెలిసింది. ఈ క్రమంలో ఆ గ్రామ ప్రజల్లో 125మందికి కరోనా టెస్టు చేయించారు. వీరిలో 31మందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో గ్రామస్థులు షాక్ అయ్యారు. ఫలితంగా ఆ ప్రాంతాన్ని కంటోన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. ఆ గ్రామ వాసులను ఇళ్లల్లోనే నిర్భంధించారు.