కరోనా నుంచి 80 శాతం మంది కోలుకుంటే.. 20శాతం మంది..?
దేశంలో కరోనా నుంచి 80 శాతం మంది బాధితులు కోలుకోగా.. 20 శాతం మంది చనిపోతున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,387కు పెరిగిందని లవ్ అగర్వాల్ తెలిపారు.
దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 32 మంది మృతి చెందారని లవ్ అగర్వాల్ చెప్పారు. ఇంకా 24 గంటల్లో 1076 కొత్త కేసులు నమోదు అయినట్లు పేర్కొంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం మరణాల సంఖ్య 452కు చేరుకోగా, 1766 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు.
ఇకపోతే.. ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు కొత్తగా 73 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాజాగా కేసులతో కలిపి యూపీలో మొత్తం బాధితుల సంఖ్య 846కు పెరిగింది. వీరిలో 74 మంది కోలుకోగా, 14 మంది మృతి చెందారు. 83 కేసులతో ఆగ్రా అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రాల వారీగా నమోదైన కేసులతో పోలిస్తే ఉత్తరప్రదేశ్ ఏడో స్థానంలో ఉంది.
3205 కేసులతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. మహారాష్ట్ర తర్వాతి స్థానంలో ఢిల్లీ ఉంది. ఢిల్లీ తర్వాత 1267 కేసులతో తమిళనాడు మూడో స్థానంలో ఉంది. 1072 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 180 మంది కోలుకోగా, 15 మంది ప్రాణాలు కోల్పోయారు.