ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 3 నవంబరు 2020 (09:07 IST)

ఒడిశా గవర్నర్‌కు కరోనా

ఒడిశా గవర్నర్‌ ప్రొఫెసర్‌ గణేషీ లాల్‌ జీ కరోనా బారినపడ్డారు. ఆయనతోపాటు ఆయన సతీమణి, మరో నలుగురు కుటుంబ సభ్యులకు కరోనా సోకిందని రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి.

దీంతో వారంతా భువనేశ్వర్‌లోని ఎస్‌యూఎం కోవిడ్‌ ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు.

ఇటీవల కాలంలో వారిని కలిసిన వారు కోవిడ్‌ టెస్టులు చేయించుకోవాలని కోరారు. కాగా గవర్నర్‌ త్వరగా కోలుకోవాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ట్వీట్‌ చేశారు.