కరోనా ఉగ్రరూపం.. 24 గంటల్లో 1654 కేసులు.. మే నెల 31 వరకు లాక్ డౌన్
కరోనా వైరస్ భారత దేశంలో తీవ్రరూపం దాల్చుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 1694 కేసులు నమోదవగా, 126 మంది మరణించారు. ఇప్పటివరకు కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 49,391కి చేరింది. వైరస్ ప్రభావంతో ఇప్పటివరకు 1694 మంది ప్రాణాలు కోల్పోయారు.
కరోనా బారిన పడిన వారిలో 14,182 మంది బాధితులు కోలుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా మరో 33,514 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో కోలుకుంటున్న వారు 28.71 శాతంగా ఉన్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 15,525కు చేసింది.
కాగా.. కేంద్రం వైరస్ విజృంభిస్తూ ఉండటంతో ఈ నెల 17 వరకు లాక్ డౌన్ ను పొడిగించిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్రం దేశవ్యాప్తంగా ఆరెంజ్, గ్రీన్ జోన్లలో సడలింపులు ఇచ్చింది. కేంద్రం సడలింపులు ఇవ్వడంతో దేశవ్యాప్తంగా మద్యం దుకాణాలతో పాటు ఇతర దుకాణాలు ప్రారంభం అయ్యాయి.
మరోవైపు కేంద్రం మే నెల 31 వరకు లాక్ డౌన్‌ను పొడిగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కేంద్రం లాక్ డౌన్‌ను పొడిగించటానికే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అనేక రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితుల గురించి కేంద్రం ఆరా తీస్తోందని తెలుస్తోంది.