Widgets Magazine Widgets Magazine

ఆపిల్‌ వాచ్‌, ఖరీదైన పెన్‌ పెట్టుకుంటేనే పార్టీ నుంచి సస్పెన్షన్‌ చేస్తారా.. దటీజ్ కమ్యూనిజం

హైదరాబాద్, శనివారం, 3 జూన్ 2017 (02:29 IST)

Widgets Magazine

సంపద విలాసాలను ఎంత ఎక్కువగా ప్రదర్శిస్తే అంత గొప్ప హోదా ఏర్పడుతున్న కాలమిది. సినీరంగ ప్రముఖులు, సెలబ్రిటీలు మాత్రమే కాదు.. రాజకీయ నాయకులు కూడా  దీనికి మినహాయింపు కాదు. 75 లక్షల ఖరీదైన వాచ్‌ని చేతికి పెట్టుకుని  అది కొన్నది కాదు... ఫ్రెండ్ ఇచ్చింది అని బుకాయిస్తే, సమర్థించుకుంటే ఇతర పార్టీలు లైట్ తీసుకుంటాయేమో కానీ కమ్యూనిస్టు పార్టీ మాత్రం ఇలాంటి సంపద ప్రదర్శనలను ససేమికా ఒప్పుకోను అని తెగేసి చెబుతోంది. కమ్యూనిస్టు పార్టీల్లో ఎన్ని లోపాలు, అవలక్షణాలు ఉన్నా కేడర్‌కి, లీడర్షిప్‌కి ఒకే స్థాయి జీవితం, హోదా ఉండాలన్న సూత్రబద్ధతకు కట్టుబడే విషయంలో వీటికి మించిన పార్టీలు దేశం మొత్తం మీద లేదు. 
 
చేతిక అపిల్ వాచ్, ఖరీదైన పెన్ పెట్టుకున్నాడని సాక్షాత్తూ పార్లమెంటు సభ్యుడిని సీపీఎం పార్టీ 3 నెలలపాటు అతడిని పార్టీనుంచి బహిష్కరించిన వైనం షాక్ ఇస్తున్నా. .ఇది కమ్యూనిస్టు పార్టీలు మాత్రమే ఆచరించే వ్యక్తిత్వం ప్రదర్శనగా మిగిలిపోవడమే విషాదం.
 
విషయం లోకి వస్తే.. వామపక్ష భావ జాలం పాటించే సీపీఎం ఆడంబరాలకు దూరంగా ఉంటుంది. అయితే పార్టీ సిద్ధాంతాలను మరిచి లగ్జరీ లైఫ్‌ స్టైల్‌ లీడ్‌ చేస్తున్న ఓ ఎంపీపై సీపీఎం పార్టీ వేటు పడింది. పార్లమెంట్ సభ్యుడు రితబ్రత బెనర్జీని  పార్టీ నుంచి మూడు నెలల పాటు బహిష్కరించింది. వామపక్ష భావజాలానికి విభిన్నంగా ఆయన జీవనశైలి ఉందనే నెపంతో రితబ్రత బెనర్ పై బహిష్కరణ వేటు వేసింది. 
 
ఆయన ఎక్కువగా హై-టెక్, ఖరీదైన గాడ్జెట్లను వాడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. నేడు(శుక్రవారం) బెంగాల్ లో జరిగిన సమావేశంలో బెనర్జీపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. బెనర్జీపై వచ్చిన ఫిర్యాదులన్నింటిపైనా విచారణకు ఆ పార్టీ ఆదేశించింది. రెండు నెలల్లో దీనిపై నివేదిక  రానుంది. అప్పటివరకు ఆయనపై ఈ సస్పెన్షన్ కొనసాగనుంది.  
 
ఖరీదైన ఆపిల్ వాచ్, లగ్జరీ మోంట్ బ్లాంక్ పెన్ (రూ.15వేల పైన నుంచి రూ. 60వేల రూపాయల మధ్యలో రేటు) వాడి బెనర్జీ ఇరకాటంలో పడ్డారు. సాకర్ మ్యాచ్ చూస్తూ ఖరీదైన యాక్ససరీస్ ధరించిన బెనర్జీ ఫోటోలను సీపీఎం నేత సుమిత్ తాల్కుదార్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అప్పట్లో దుమారం చెలరేగింది.
 
అయితే  బెనర్జీపై వచ్చిన ఫిర్యాదుతో పాటు ఆయనపై సస్పెన్షన్‌ వేటు అంశంపై మాట్లాడేందుకు బెంగాల్ సీనియర్ సీపీఎం నేత సుర్జ్యా కాంత మిశ్రా నిరాకరించారు. పార్టీలోని అంతర్గత అంశాలను బహిర్గతం చేయలేమని ఆయన తెలిపారు.
 
కమ్యూనిస్టు పార్టీల అంతర్గత విషయాల మాట అలా పక్కన బెట్టి నాయకులైనా సరే సామాన్య ప్రజాజీవితానికి భిన్నమైన పోకడలు పోతే సహించ లేదంటూ ఈ దేశంలో ఒక కమ్యూనిస్టు పార్టీ ఈ నాటికీ ఒక ఆదర్శాన్ని అమలు చేస్తుండటం నిజంగా ప్రశంసించ వలసిన విషయం.
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నగదు లావాదేవీ రూ.2 లక్షలకు మించితే.. అంతే మొత్తం పెనాల్టీ కట్టాల్సిందే

ఒకే రోజులో రూ.2 లక్షలు లేదా అంతకుమించిన నగదు లావాదేవీలపై నిషేధం విధించిన నేపధ్యంలో భారీ ...

news

అవినీతిపై ధైర్యంగా ఫిర్యాదు చేయండి... వివరాలు గోప్యంగా ఉంచుతాం : ప్రభుత్వ సలహాదారు పరకాల

ప్రభుత్వం నుంచి అందుతున్న సేవలపై ఫిర్యాదులుంటే.. కాల్ సెంటర్ (1100)కు ధైర్యంగా ఫిర్యాదు ...

news

వ్యక్తుల కోసం కాదు వ్యవస్థ కోసమే... 20 నుంచి ‘మహాప్రస్థానం’ వాహనాలు... కామినేని

అమరావతి : వ్యక్తుల కోసం కాదు... వ్యవస్థ కోసమే పీజీ డిగ్రీ కలిగిన వైద్యుల పదవీ విరమణ ...

news

ప్రేమలో పడింది... అలా కలిశారు... పేరెంట్స్‌కి ఆ చిత్రాలు చూపించింది...

ఇటీవలి కాలంలో తక్కువ వయసున్న అబ్బాయిలతో ఎక్కువ వయసున్న యువతులు ప్రేమాయణం సాగిస్తున్న ...