గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 5 డిశెంబరు 2023 (10:40 IST)

మిచౌంగ్ తుఫాన్ బీభత్సం, అంధకారంలో చెన్నై మహానగరం, 47 ఏళ్ల తర్వాత ఇంతటి భారీ వర్షం

rain
మిచౌంగ్ తుఫాన్ చెన్నై మహానగరంలో బీభత్సం సృష్టిస్తోంది. జల ప్రళయం తలపించేవిధంగా నగరం పూర్తిగా జలమయం అయిపోయింది. గత 47 ఏళ్ల చరిత్రంలో చెన్నై నగరంలో ఇంత భారీ వర్షాలు పడలేదని చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. వరదల కారణంగా చెన్నై విమానాశ్రయంలో కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విమానాశ్రయానికి చేరుకునే, బయలుదేరే డెబ్బై విమానాలు రద్దు చేయబడ్డాయి.
 
మిచౌంగ్ తుఫాను బీభత్సం, అంధకారంలో చెన్నై నగరం
తీవ్రమైన తుఫాను కారణంగా చెన్నై విద్యుత్ సమస్యలు, విద్యుత్ కోతలను ఎదుర్కొంటోంది. ప్రజల భద్రత కోసం ప్రభుత్వం చేసిన ఫీడర్లను మాన్యువల్ ట్రిప్పింగ్ చేయడంతో విద్యుత్తు సరఫరారి అంతరాయం ఏర్పడింది. తమిళనాడు పరిశ్రమల మంత్రి సోషల్ మీడియా పోస్ట్‌లో, “చాలామంది ఫీడర్‌లు భద్రతా కారణాల దృష్ట్యా ట్రిప్ చేయబడ్డాయి” అని అన్నారు. చెన్నైలోని 1,814 11కెవి ఫీడర్లలో 712 ఫీడర్లు పనిచేయడం లేదని మంత్రి తెలిపారు.
 
డిసెంబర్ 5న పబ్లిక్ హాలిడే ప్రకటించారు
మిచౌంగ్ తుఫాను నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం డిసెంబర్ 5, 2023 మంగళవారం చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో పబ్లిక్ హాలిడే ప్రకటించింది. చెన్నై, తిరువళ్లూరులోని నాలుగు జిల్లాల్లోని ప్రభుత్వ సంస్థలు-కార్పొరేషన్లు, బోర్డులు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల కార్యాలయాలతో సహా అన్ని పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు శెలవు ప్రకటించారు.