గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 10 అక్టోబరు 2019 (11:22 IST)

కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ 5శాతం పెంపు

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 49.93 లక్షల మంది ఉద్యోగులకు, 65.26 లక్షల మంది పెన్షనర్లకు శుభవార్త. ఉద్యోగులకు కరువు భత్యాన్ని (డీఏ), పింఛనుదార్లకు కరువు ఉపశమనాన్ని(డీఆర్‌) మోదీ ప్రభుత్వం 5శాతానికి పెంచుతూ దీపావళి కానుకను ప్రకటించింది.

దీంతో వారి డీఏ 17 శాతానికి చేరినట్లయింది. ఈ ఏడాది జూలై 1 నుంచి ఇది వర్తిస్తుంది. బుధవారం కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకు 5 పెంచడం వల్ల ఖజానాపై ఏటా రూ.15,909 కోట్లు, రిటైర్డ్‌ ఉద్యోగులకు డీఆర్‌ పెంపు వల్ల రూ.10,606.20 కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు.

డీఏ ఒకేసారి 5శాతం పెంచడం ఇదే మొదటిసారని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ తెలిపారు.