శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 26 జులై 2017 (09:17 IST)

మైనర్ బాలికను పాడుబడిన ఇంట్లోకి లాక్కెళ్లి... గ్యాంగ్ రేప్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో సామూహిక అత్యాచారం జరిగింది. బహిర్భూమికంటూ వెళ్లిన ఓ దళిత బాలికను కొందరు కామాంధులు బలవంతంగా పాడుబడిన ఇంట్లోకి లాక్కెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. ఈ దారుణం ఫిరోజాబాద్‌లో జరిగింది

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో సామూహిక అత్యాచారం జరిగింది. బహిర్భూమికంటూ వెళ్లిన ఓ దళిత బాలికను కొందరు కామాంధులు బలవంతంగా పాడుబడిన ఇంట్లోకి లాక్కెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. ఈ దారుణం ఫిరోజాబాద్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఫిరోజాబాద్ నగర సమీపంలోని నాగ్లా కేస్రీ గ్రామానికి చెందిన 15 ఏళ్ల దళిత బాలిక ఒంటరిగా బహిర్భూమికి వెళ్లింది. ఈ విషయాన్ని గమనించిన అదే గ్రామానికి చెందిన అతుల్ దూబే, అంగద్ యాదవ్, మోటా, కలువాలనే అనే నలుగురు కామాంధులు ఆ బాలికను పాడుబడిన ఇంట్లోకి లాక్కెళ్లారు. 
 
ఆపై ఆమెపై సామూహికంగా అత్యాచారానిక పాల్పడ్డారు. తమ కామవాంఛ తీర్చుకున్న తర్వాత సంఘటన స్థలంలో బాలికను వదిలి యువకులు పారిపోయారు. బాలిక ఇంటికి వచ్చి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత బాలికను వైద్యపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించి పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.