శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 23 సెప్టెంబరు 2014 (10:50 IST)

దారుణం: కులవివక్ష.. మంచినీరు తాగిన పాపానికి..?

దేశంలో ఇంకా కొన్ని చోట్ల కుల వివక్ష కొనసాగుతూనే ఉంది. ఇందుకు నిదర్శనం రాజస్థాన్‌లోని బికనీర్‌లో జరిగిన ఈ సంఘటనే ఉదాహరణ. అగ్రకులానికి చెందిన ఓ ఉపాధ్యాయుని కోసం ఏర్పాటు చేసిన కుండలోని మంచినీటిని తాగిన పదకొండు మంది దళిత విద్యార్దులను సస్పెండ్ చేశారు.
 
రాజస్థాన్‌లో బికనీర్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. బికనీర్‌కు 70 కిమీ దూరంలో ఉన్న తట్ గ్రామంలో ఈ ఘటన సెప్టెంబర్ 1న జరిగితే ఇటీవలే వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో పనిచేస్తున్న అగ్రకులానికి చెందిన మంగల్ సింగ్ ఈ హేయమైన చర్యకు పాల్పడ్డారు. తాను తాగటానికి ఉంచుకున్న నీరును ఈ విద్యార్థులు అంటుకోవటంతో కుండ అపవిత్రమైపోయిందని భావించి మంగళ్‌సింగ్ ఈ విద్యార్థులను సస్పెండ్ చేశారు.
 
ఈ విషయం తెలుసుకున్న విద్యార్దుల తల్లిందండ్రులు మంగిలాల్, ప్రకాష్ రామ్ మెగ్వాల్ ఇద్దరూ ఉపాధ్యాయుడి ప్రశ్నించగా... తాను తాగటానికి ఉంచుకున్న నీటిని విద్యార్థులు అంటుకోవటంతో కుండ అపవిత్రమైపోయిందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు.
 
ఈ విషయంపై తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఆర్తీ డోగ్రా మాట్లాడుతూ స్కూలు ఉపాధ్యాయుడిని అరెస్టు చేశామని, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, జిల్లా విద్యాశాఖ అధికారి ఇద్దరిని ఆ గ్రామానికి వెళ్లి డిటేల్ రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపారు.