శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 11 ఫిబ్రవరి 2021 (22:17 IST)

గాఢంగా ప్రేమించింది, పెళ్ళి సమయానికి మరో ప్రేమికుడితో జంప్...

నాలుగేళ్ళు ప్రేమించిన ప్రియుడిని వివాహం చేసుకోవాల్సిన వధువు ఆఖరి క్షణంలో మరో ప్రియుడితో వెళ్ళిపోవడంతో బంధువులు, స్నేహితులు నిశ్చేష్టులయ్యారు. చెన్నై నగరంలోని నుంగంబాక్కంకు చెందిన 23 యేళ్ళ పెరియమ్మాళ్ ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది.
 
అదే సంస్థలో పనిచేస్తున్న నెమిలిచేరికి చెందిన సెంథిల్ కుమార్‌తో ప్రేమ వ్యవహారం నడిపింది. దీంతో వీరి ప్రేమ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు వివాహానికి ప్లాన్ చేశారు. కళ్యాణ మండపం బుక్ చేశారు. నిన్న సాయంత్రం వివాహం జరగాల్సి ఉంది. బంధువులతో హడావిడిగా మారిపోయింది మండపం.
 
ఉదయం 5 గంటలకే ముహూర్తం. అందరూ నిద్రించే సమయంలో తెల్లవారుజామున 3 గంటలకు వధువు వేరొక యువకుడితో పారిపోయింది. వరుడు అంతా వెతికి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగి సిసి ఫుటేజ్‌లను పరిశీలిస్తే పెళ్ళి బట్టలతోనే యువకుడితో యువతి పారిపోయినట్లు గుర్తించారు.
 
సెంథిల్ కుమార్‌తో పాటు మరొక యువకుడితోను ఈమె ప్రేమాయణం సాగించినట్లు ఆమె స్నేహితులు తరువాత చెప్పారు. పారిపోయిన వారి కోసం పోలీసులు వెతుకుతున్నారు.