1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 19 మార్చి 2017 (10:41 IST)

భర్త వెనుక ఉండి కొందరు అసత్యపు ప్రచారాలు చేస్తున్నారు: దీప

దివంగత సీఎం ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్‌కు భర్త షాకిచ్చారు. తమపై వస్తున్న వదంతుల వెనుక శశికళ కుటుంబ సభ్యులు ఉన్నారని దీపా ఆరోపించారు. స్థానిక టి నగర్‌లోని తమ నివాసంలో మీడియాతో మాట్లాడుతూ

దివంగత సీఎం ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్‌కు భర్త షాకిచ్చారు. తమపై వస్తున్న వదంతుల వెనుక శశికళ కుటుంబ సభ్యులు ఉన్నారని దీపా ఆరోపించారు.

స్థానిక టి నగర్‌లోని తమ నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. తనను ఆర్కే నగర్‌లో పోటీ చేయనివ్వకుండా అడ్డుకొనేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు. తన భర్త వెనుక కొందరు ఉండి అసత్యపు ప్రచారాలను చేయిస్తున్నారన్నారు. 
 
ఈ ప్రచారం వెనుక శశికళ కుటుంబం ఉందని దీపా ఆరోపించారు. ఇలాంటి వదంతులను ఎంజీఆర్‌ అమ్మా దీపా పేరవై కార్యకర్తలు నమ్మరాదని కోరారు. కొత్త పార్టీ పెడతాననే తన భర్త ప్రకటించడాన్ని తాను ఊహించలేదని జయకుమార్ తెలిపారు. తన సొంత మనుషులే తనకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.