గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 జులై 2022 (19:52 IST)

తండ్రిని కొట్టాడని బాలుడి ప్రతీకారం.. తుపాకీతో కాల్పులు

shooting
shooting
తండ్రిపై దాడి చేసిన వ్యక్తిపై బాలుడు ప్రతీకారం తీర్చుకున్నాడు. అతడి ముఖంపై తుపాకీతో కాల్పులు జరిపాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటనలో జహంగీర్‌పురి ప్రాంతానికి చెందిన 36 ఏళ్ల జావేద్ తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడి తుపాకీ కాల్పుల్లో జావేద్‌ కుడి కంటికి తీవ్ర గాయమైంది.
 
వివరాల్లోకి వెళితే.. శుక్రవారం సాయంత్రం స్థానిక పార్కు సమీపంలో జావేద్ కూర్చొని ఉండగా.. ముగ్గురు బాలురు అక్కడకు వచ్చారు. ఒక బాలుడు తన ప్యాంట్‌ జేబు నుంచి తుపాకీ తీశాడు. జావేద్‌కు దగ్గరగా వెళ్లి అతడి ముఖంపై కాల్పులు జరిపాడు. అనంతరం ఆ ముగ్గురు బాలురు అక్కడి నుంచి పారిపోయారు.
 
ఈ సమాచారం అందుకున్న పోలీసులు జావేద్‌పై కాల్పులకు సంబంధించి నలుగురు మైనర్‌ బాలురను అరెస్ట్‌ చేశారు. 
 
అందులోని ఒక బాలుడి తండ్రిని ఏడు నెలల కిందట జావేద్‌ కొట్టడంతో వారు అతడిపై ప్రతీకారం తీర్చుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీలో రికార్డైన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.