Widgets Magazine Widgets Magazine

తప్పిపోయి ఢిల్లీకొచ్చింది.. రేప్‌కు గురైంది.. ఆపై రూ.70వేలకు సేలైపోయింది..

శనివారం, 4 ఫిబ్రవరి 2017 (12:55 IST)

Widgets Magazine
rape victim girl

పాపం ఆ చిన్నారి తప్పిపోయింది. ఇలా ఎలాగో ఢిల్లీకి చేరుకుంది. అయితే అక్కడే ఆ బాలికను దురదృష్టం వెంటాడింది.ఏళ్ల ఓ బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు బాలికపై అత్యాచారానికి పాల్పడి.. ఆపై రూ.70వేలకు విక్రయించిన వైనం తాజాగా వెలుగుచూసింది.

అచ్చం సినిమాలోలాగా బాలికపై జరిగిన రేప్, విక్రయ వ్యవహారంపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 363, 366, 376, 328,506, పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఎయిమ్స్‌కు పంపించి నిందితులైన పప్పుయాదవ్, అఫ్రోజ్‌లను అరెస్టు చేశారు.
 
వివరాల్లోకి వెళితే... చత్తీస్‌ఘడ్ కు చెందిన 15 ఏళ్ల ఓ బాలిక బంధువుల ఇంటికి వెళుతూ పొరపాటున ఢిల్లీకి వెళ్లే రైలు ఎక్కింది. ఢిల్లీ రైల్వే స్టేషనుకు చేరిన మైనర్ బాలికను నీళ్ల బాటిళ్లు విక్రయించే ఆర్మాన్ అనే యువకుడు సరాయి కాలేఖాన్ ప్రాంతంలోని ఇంటికి తీసుకువెళ్లి భార్య హసీనా సహకారంతోనే అత్యాచారం చేశాడు. ఆపై బాలికను పప్పు యాదవ్ అనే యువకుడికి రూ.70వేలకు విక్రయించగా అతడు పెళ్లి చేసుకుని వేధింపులు మొదలెట్టాడు. 
 
అతని వేధింపుల బారి నుంచి తప్పించుకునేందుకు.. బాలిక పప్పుయాదవ్ ఇంటి నుంచి పారిపోయి హజ్రత్ నిజాముద్దీన్ రైల్వేస్టేషనుకు వచ్చి హసీనాను కలిసింది. హసీనా బాలికకు మత్తు మందు ఇచ్చి ఓ గదిలోకి తీసుకువెళ్లగా మహమ్మద్ అఫ్రోజ్ అనే యువకుడు బాలికపై అత్యాచారం చేసి హసీనాకు డబ్బులిచ్చాడు.

స్పృహలోకి వచ్చిన బాలిక అక్కడినుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జయ నమ్మినబంటు.. షీలా బాలకృష్ణన్‌ను చిన్నమ్మ పొమ్మన్నారా? రాజీనామా చేసేశారా?

తమిళనాట అమ్మ మరణానికి అనంతరం అన్నాడీఎంకేలో లుకలుకలు ప్రారంభమైనాయి. అమ్మ అడుగు జాడల్లోనే ...

news

ఓపీ Vs శశికళ.. 8 లేదా 9న ముహూర్తం.. అమ్మ స్థానంలో సీఎంగా శశికళ?

అన్నాడీఎంకే మాజీ చీఫ్, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి అనంతరం తమిళనాడు రాజకీయ ...

news

యువతి ఇంటికెళ్లే అత్యాచారం చేశాడు.. ఆపై హత్య చేశాడు.. నగ్నంగా పడివున్న?

మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కఠిన శిక్షలు లేకపోవడంతో మహిళలపై కామాంధులు ...

news

సన్నీలియోన్‌ను ఆదర్శంగా తీసుకోమన్నాడు.. కేవీ విద్యార్థినిపై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు..

విద్యార్థినితో ఏ ప్రిన్సిపాల్ అసభ్యంగా ప్రవర్తించాడు. అదీ చాలక సన్నీలియోన్‌ను ఆదర్శంగా ...