Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎలా అత్యాచారం జరిగిందో బొమ్మ గీసి చూపించింది.. నిందితుడికి ఐదేళ్ల జైలు

బుధవారం, 14 జూన్ 2017 (10:37 IST)

Widgets Magazine

తనపై జరిగిన అఘాయిత్యాన్ని బాలిక ఓ పేపర్‌పై బొమ్మలేసి చూపించి జరిగిన దాన్ని కళ్లకు కట్టినట్లు కోర్టుకు చూపించడంతో.. అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని దోషిగా తేల్చింది. అంతేకాకుండా ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. బసచేసేందుకు నీడ ఇచ్చాననే ధీమాతో ఓ వ్యక్తిపై బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘాతుకానికి సాక్ష్యాధారాలు లేవని సంబరపడుతున్న వేళ.. తనపై జరిగిన అఘాయిత్యాన్ని బాలిక ఓ పేపర్‌పై బొమ్మలేసి చూపించి జరిగిన దాన్ని కళ్లకు కట్టినట్టు కోర్టుకు చూపించింది. దీంతో నిందితుడికి జైలు శిక్ష తప్పలేదు. 
 
వివరాల్లోకి వెళితే, కోల్‌కతాకు చెందని ఓ బాలిక (10) ఢిల్లీలోని తన మామయ్య అక్తర్ అహ్మద్ ఇంటిలో ఉండి చదువుకుంటోంది. రెండేళ్ల క్రితం అంటే.. బాలిక 8 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అక్తర్ ఆ చిన్నారిపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గతేడాది జూన్‌లో అక్తర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిందితుడు తప్పుకునే అవకాశం ఉండటంతో.. బాలిక వద్ద విచారణ చేపట్టారు. 
 
విచారణలో భాగంగా కోర్టులో బాలికకు ఓ పేపర్, క్రేయాన్లు ఇచ్చి  ఏం జరిగిందో బొమ్మ గీసి చూపించమనగా, బాలిక తనపై జరిగిన అత్యాచారం తీరును కళ్లకు కట్టినట్టు బొమ్మ గీసి చూపించింది. దీంతో నిందితుడికి జైలు శిక్ష తప్పలేదు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అగ్నికి ఆహుతైన లండన్‌ గ్రెన్ ఫెల్ టవర్‌: ఒకటే దారి.. వందలాది మంది సజీవదహనం..

లండన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో వందలాది మంది సజీవదహనమై వుంటారని ...

news

బంగ్లాదేశ్‌లో భారీ వర్షాలు: 107 మందికిపైగా మృతి.. వంద మందికిపైగా గాయాలు

బంగ్లాదేశ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వానల ధాటికి ...

news

ఆ గ్రామంలో ఐదు రోజులు మహిళలు దుస్తులు వేసుకోరట.. భార్యతో భర్త ఒక్క మాట కూడా?

హిమాచల్ ప్రదేశ్‌లోని వీణా అనే గ్రామంలో ప్రజల జీవనశైలి వింతగా వుంటుంది. ఇప్పటికీ అక్కడి ...

news

విడాకులు తీసుకున్నారు.. మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. ఇంతలో ఏం జరిగిందంటే?

ఆ దంపతులు విడాకులు తీసుకున్నారు. అయినా మళ్లీ ఏకం కావాలనుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. ...

Widgets Magazine