శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 డిశెంబరు 2019 (12:37 IST)

11 మంది సూసైడ్ చేసుకున్న ఇంటిని అలా మార్చేశారు..

దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ఇంట్లో 11 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన 2018లో ఢిల్లీలో బురాఢీలో జరిగింది. ఈ విషాదకర ఘటన సంచలనం సృష్టించింది. ఆ ఆత్మహత్యల తర్వాత ఆ ఇల్లు ఖాళీగానే ఉంది. ఆ ఇంట్లోకి అద్దెకు వచ్చేందుకు ఏ ఒక్కరూ సాహసం చేయలేదు. 
 
ఈ పరిస్థితుల్లో మోహన్ సింగ్ అనే వ్యక్తి ముందుకు వచ్చారు. ఆ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఆ ఇంటిని రక్తపరీక్షలు చేసే డయాగ్నోస్టిక్ సెంటర్‌కా మార్చేశారు. ఇల్లు మొత్తాన్ని అద్దెకు తీసుకన్న వ్యక్తి.. బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో పాథాలజీ ల్యాబ్‌ను ప్రారంభించారు. 
 
మొదటి అంతస్తులో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన నివసిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను మూఢనమ్మకాలను విశ్వసించనన్నారు. రోడ్డుకు దగ్గరగా ఉండటంతో ల్యాబ్‌కు వచ్చే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోందని మోహన్ సింగ్ చెప్పుకొచ్చారు.