రిపబ్లిక్ డే వేడుకలకు ఢిల్లీ రెడీ: దేశ వ్యాప్తంగా పటిష్ట భద్రత

security
ఎం| Last Updated: శనివారం, 25 జనవరి 2020 (22:18 IST)
రిపబ్లిక్ డే వేడుకలకు ఢిల్లీ రెడీ అయింది. దీంతో ఢిల్లీలోని పలు ఏరియాలను తమ ఆదీనంలోకి తీసుకున్నారు పోలీసులు. విజయ్ చౌక్ నుంచి ఇండియా గేట్ వరకు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.

శనివారం సాయంత్రం 6గంటల నుంచి రిపబ్లిక్ డే వేడుకలు పూర్తయ్యేవరకు ఈ రూట్లో
ట్రాఫిక్ కు అనుమతి లేదని తెలిపారు. ఈ రోజు రాత్రి 11గంటల నుంచి రఫి మార్గ్, జన్ పత్, మన్ సింగ్ రోడ్ లో
ఆంక్షలు పెట్టారు.

రాత్రి 2గంటల నుంచి ఇండియా గేట్ మూసివేయనున్నారు. ఆదివారం పొద్దున 5గంటల నుంచి తిలక్ మార్గ్, BSZమార్గ్ & సుభాష్ మార్గ్ లో ట్రాఫిక్ ను అనుమతించబోమని పోలీసులు తెలిపారు.

రిపబ్లిక్ డే పరేడ్ లో హింసాత్మక ఘటనలకు పాల్పడేందుకు తీవ్రవాదులు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో దేశ వ్యాప్తంగా పోలీసులు అలెర్ట్ అయ్యారు. పలు ప్రాంతాల్లో తనిఖీలు జరుపుతున్నారు. తమిళనాడు రామేశ్వరం వద్ద పంబ రైలు బ్రిడ్జి దగ్గర సెక్యురిటీని టైట్ చేశారు.దీనిపై మరింత చదవండి :