గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 జూన్ 2021 (13:50 IST)

ఢిల్లీలో అగ్నిప్రమాదం.. షోరూమ్‌లో మంటలు..

దేశ రాజధాని నగరం ఢిల్లీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని లజపత్ నగర్ మార్కెట్లోకి ఓ షోరూమ్‌లో చోటుచేసుకున్న ఈ అగ్ని ప్రమాదంలో భారీ మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు హుటాహుటిన దాదాపు 30 అగ్నిమాపక శకటాలు చేరుకున్నాయి. అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం, లజపత్ నగర్ సెంట్రల్ మార్కెట్లో, బ్లాక్ 1 వద్ద ఈ ప్రమాదం సంభవించింది. 
 
ఈ సమాచారం అందిన వెంటనే దాదాపు 30 అగ్నిమాపక శకటాలతో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ చీఫ్ అతుల్ గార్గ్ ఇచ్చిన ట్వీట్‌లో, సెంట్రల్ మార్కెట్లోని ఓ బట్టల దుకాణంలో ప్రమాదం జరిగినట్లు తెలిపారు. మొత్తం 30 అగ్ని మాపక శకటాలతో మంటలను ఆర్పుతున్నట్లు తెలిపారు. ప్రాణనష్టం జరిగినట్లు ఇప్పటి వరకు సమాచారం లేదని తెలిపారు.
 
ఈ ప్రమాదంలో నాలుగు దుకాణాలు అగ్ని ఆహుతైనట్లు సమాచారం. ఓ నెల రోజులపాటు అమలైన అష్ట దిగ్బంధనం తర్వాత ఈ దుకాణాలను తెరిచారు. మంటలు భారీగా చెలరేగడంతో పెద్ద ఎత్తున పొగ, ధూళి మేఘాలు వ్యాపించాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది.