శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 19 డిశెంబరు 2022 (13:27 IST)

ఐదో తరగతి విద్యార్థిని కిందకు తోసేసిన స్కూల్ టీచర్

arrest
దేశ రాజధాని ఢిల్లీలో ఓ అమానుష ఘటన జరిగింది. తన వద్దకు చదువుకునేందుకు వచ్చిన ఐదో తరగతి విద్యార్థిని స్కూల్ టీచర్ ఒకరు పాఠశాల మొదటి అంతస్తు నుంచి కిందకు తోసేసింది. దీంతో ఆ విద్యార్థి గాయపడ్డారు. ప్రస్తుతం ఈ విద్యార్థిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన సెంట్రల్ ఢిల్లీ మోడల్ బస్తీలోని ప్రాత్మిక్ విద్యాలయంలో జరిగింది. 
 
ఈ స్కూల్‌లో పని చేసే గీతా దేశ్వాల్ అనే ఉపాధ్యాయురాలు ఏదో తరగతి విద్యార్థిపై తొలుత కత్తెరతో దాడి చేసింది. ఆ తర్వాత అన్ని మొదటి అంతస్తు నుంచి కిందికి తోసేసింది. దీన్ని గమనించిన ఇతర విద్యార్థులు, ఉపాధ్యాయులు సమీపంలోని హిందూరావు ఆస్పత్రికి తరలించారు. 
 
విషయం తెలుసుకున్న పోలీసులు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయురాలిని అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాన్ని సాక్ష్యంగా చేసుకుని అటెంప్ట్ మర్డర్ కేసును నమోదు చేసినట్టు ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ తెలిపారు. అలాగే, టీచర్‌ను ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు.