ఛత్తీస్ ఘర్ లో ఆవు పేడకు డిమాండ్.. ఎందుకో తెలుసా?
ఇన్నాళ్లూ ఆవు సెంటిమెంట్ తో ఆడుకున్న రాజకీయ పార్టీలు.. ఇప్పుడు ఆవు పేడ, ఆవు మూత్రం వెంటపడ్డాయి. ఛత్తీస్ ఘర్ లో ఈ రాజకీయం పరాకాష్టకు చేరింది. చత్తీస్‌ఘర్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం నేరుగా ఇప్పుడు ఆవు పేడను కొంటోంది.
కేజీ రెండు రూపాయలకు రైతుల నుండి సేకరిస్తోంది. దీనికి 'గోధన్ న్యారు యాజన్' అనే పేరు కూడా పెట్టింది. ఈ పథకం కింద సేకరించిన పేడతో వర్మికంపోస్ట్ తయారుచేసి అన్నదాతలకు అందించనున్నారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు.
ఈ పథకం కారణంగా పశువులకు సరైన పశుగ్రాసం లభిస్తుందని, రైతులు లాభాలు ఆర్జిస్తారని సర్కారు చెబుతోంది. రాష్ట్రంలో వ్యవసాయ కార్యకలాపాలు మొదలవడానికి ముందు నిర్వహించే హరేలీ ఉత్సవంలో భాగంగా ఈ పథకాన్ని సిఎం భూపేశ్ భగేల్ ప్రారంభించారు.