శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 జనవరి 2021 (11:27 IST)

చికెన్ లేదని చెప్పారు.. అంతే దాబాకే నిప్పంటించారు.. ఎక్కడ?

చికెన్ లేకుంటే కొందరికి ముద్ద దిగదు. అలాంటి వ్యక్తి చికెన్ లేదని చెప్పిన దాబాకు నిప్పు అంటించాడు. అసలే తాగినమత్తులో ఉన్నవారు ఏకంగా దాబాకు నిప్పంటించేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో నాగ్‌పూర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శంకర్ టైడే(29), సాగర్ పటేల్(19) ఇద్దరు ఫుల్‌గా మద్యం సేవించారు. అనంతరం అర్దరాత్రి ఒంటిగంట సమయంలో బెల్టారోడి ప్రాంతంలోని రోడ్డుపక్కన ఉన్న ఓ దాబా హోటల్‌కు వెళ్లారు. 
 
చికెన్ ఐటమ్ కోసం ఆర్డర్ చేశారు. అయితే అప్పటికే ఆ దాబాలో చికెన్ అయిపోంది. దీంతో దాబా ఓనర్ వారికి చికెన్ దొరకదని సమాధానం ఇచ్చాడు.. అయితే శంకర్, సాగర్‌లు మాత్రం తమకు తప్పకుండా చికెన్ కావాలని దాబా ఓనర్‌తో వాదనకు దిగారు. తినడానికి చికెన్ ఐటమ్స్ దొరకకపోవడంతో ఆవేశానికి లోనైన ఇద్దరు నిందితులు దాబాకు నిప్పంటించారు.
 
అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికి హాని జరగలేదు. దాబాలోని వారంతా బయటకు రావడంతో ప్రమాదం తప్పింది. దాబా కాలిపోవడంతో ఆస్తి నష్టం మాత్రం జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇక, కేసు నమోదు చేసుకుని నిందితులను విచారిస్తున్నారు.