డేరా బాబా ఆశ్రమంలోని టాయిలెట్లలో కూడా సీసీటీవీ కెమెరాలు

బుధవారం, 13 సెప్టెంబరు 2017 (10:37 IST)

సిర్సాలోని డేరా బాబా ఆశ్రమంలో ఉన్న టాయిలెట్లలో కూడా సీసీటీవీ కెమెరాలను అమర్చిన విషయం తాజాగా బహిర్గతమైంది. సాధ్వీల అత్యాచారం కేసులో 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ రాంరహీం సింగ్‌కు చెందిన డేరా ఆశ్రమాన్ని ప్రతి అణువణువూ తనిఖీ చేస్తున్నారు. అలాగే, పలువురిని అరెస్టు చేస్తున్నారు. 
 
ఈ క్రమంలో తాజాగా డేరా సచ్చా సౌధాకు చెందిన ఐటీ విభాగం హెడ్ వినీత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఫరీదాబాద్ నివాసి అయిన ఈయనపై సిర్సాలోని మిల్క్‌ప్లాంట్, షాహ్‌పూర్‌లోని విద్యుత్ కేంద్రాలకు నిప్పుపెట్టడం, ప్రభుత్వ కార్యకలాపాలకు భంగం కలిగించడం, దేశద్రోహం తదితర ఆరోపణలతో పోలీసులు వినీత్‌ను అరెస్ట్ చేశారు. 
 
ఆ తర్వాత ఆయన వద్ద పోలీసులు జరిపిన విచారణలో అనేక విషయాలు వెల్లడయ్యాయి. డేరా పరిసర ప్రాంతాల్లో అనేక సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసివున్నట్టు తెలిపారు. వీటి నంచి 5 వేల సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలోని అత్యధిక కెమెరాలు బాబాకు చెందిన 91 ఎకారాల్లో నిర్మించిన అద్భుత మహల్, హోటల్, రిసార్ట్స్, సత్సంగ్ భవనంతో పాటు.. చివరకు పలు ప్రాంతాల్లోని మరుగుదొడ్లలో కూడా వీటిని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. దీనిపై మరింత చదవండి :  
Arrest Dera It Head Dera Sacha Sauda Violence

Loading comments ...

తెలుగు వార్తలు

news

రాందేవ్ ఓ దొంగ బాబా.. కాషాయం ధరించి వ్యాపారాలు చేసుకోవచ్చా?: డిగ్గీ రాజా

యోగా గురు బాబా రాందేవ్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్రస్థాయిలో ...

news

జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర... సీన్లోకి ప్రశాంత్ కిషోర్.. జగన్‌కు క్లాస్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. వైసీపీ ...

news

పెళ్లి చేసుకోవాలంటా ఒత్తిడి తెచ్చిన చాందినీ... చంపేసిన ప్రియుడు...

హైదరాబాద్ న‌గ‌రంలో సంచ‌ల‌నం సృష్టించిన చాందినీ జైన్ హ‌త్య కేసులోని మిస్టరీని ఎట్ట‌కేల‌కు ...

news

రాజకీయాలకు దూరమని చెప్పా.. దానికి కట్టుబడి ఉన్నా : లగడపాటి

రాజకీయాలకు దూరమని గతంలోనే చెప్పానని దానికి కట్టుబడి ఉన్నానని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి ...