శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 సెప్టెంబరు 2021 (16:57 IST)

దీపావళి సంబరాల్లో బాణసంచా వాడకంపై సంపూర్ణ నిషేధం

వాతావరణ కాలుష్యంతో దేశ రాజధాని ఢిల్లీ అల్లాడుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీపావళి సంబరాల్లో బాణసంచా ఉపయోగించడంపై అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. 
 
అన్ని రకాల బాణసంచా నిల్వ, అమ్మకాలు, వాడకంపై సంపూర్ణ నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. దీపావళి పండుగ పురస్కరించుకుని జరుపుకునే బాణాసంచా సంబరాలు, టపాసుల శబ్దాలు, పొగతో గాలి కాలుష్యం స్థాయి ప్రమాదకర స్థితిలో ఉంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ఈ మేరకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బుధవారం ట్వీట్టర్ వేదికగా వెల్లడించారు. గత ఏడాది కూడా దీపావళి బాణసంచా కాల్చడంపై ఢిల్లీ ప్రభుత్వం సంపూర్ణ నిషేధం విధించింది. ప్రమాదకర గాలి కాలుష్యానికి, కోవిడ్-19 వ్యాప్తికి సంబంధం ఉందని నిపుణుల సూచనల మేరకు ఈ నిషేధం విధించింది.