శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (09:19 IST)

డీఎంకే హిందూ వ్యతిరేక పార్టీ.. బీజేపీ యువమోర్చా చీఫ్

Tejasvi Surya
ద్రావిడ మున్నేట కళగం (డీఎంకే)ను హిందూ వ్యతిరేక పార్టీ అని, ఎన్నికల్లో దాన్ని ఓడించాలని బీజేపీ యువమోర్చా చీఫ్ తేజస్వి సూర్య సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎంకేను ఎన్నికల్లో ఓడించాలని తమిళనాడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం తమిళనాడులోని సేలంలో జరిగిన కార్యక్రమంలో తేజస్వీసూర్య మాట్లాడారు. 
 
ఎంకే స్టాలిన్ పార్టీని ఓడించాలని తేజస్వీసూర్య ప్రజలను అభ్యర్థించారు, ''బీజేపీ మాత్రమే భారతదేశంలోని అన్ని ప్రాంతీయ భాషలను గౌరవిస్తుంది , ప్రోత్సహిస్తుంది...డీఎంకే హిందూ వ్యతిరేక పార్టీ, ప్రతి తమిళుడు గర్వించదగిన హిందువు. 
 
దేశంలో అత్యధిక సంఖ్యలో దేవాలయాలు ఉన్న పవిత్ర భూమి కూడా తమిళనాడే. తమిళనాడులోని ప్రతి అంగుళం పవిత్రమైనది, కాని డీఎంకే హిందూ మత వ్యతిరేకం కాబట్టి ఆ పార్టీని ఓడించాలి''అని సూర్య బీజేవైఎం రాష్ట్ర సదస్సులో కోరారు. బీజేపీ, ఎఐఎడిఎంకెను తమిళ ఓటర్లు ఆశీర్వదిస్తారని సూర్య చెప్పారు. డీఎంకే కుటుంబమే పార్టీగా కలిగివుందని, భారతదేశంలోని అన్ని ప్రాంతీయ భాషలను గౌరవించే, ప్రోత్సహించే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. తమిళం మనుగడ సాగించాలంటే హిందుత్వం గెలవాలి."అని ఆయన అన్నారు.