సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By మోహన్ మొగరాల
Last Modified: మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (16:24 IST)

నాతో రావా... ఏం ఎవడితోనైనా లింకుందా? భార్యను స్నేహితుడి గదికి తీస్కెళ్లి...

భార్య శృంగారానికి సహకరించడం లేదని ఆమెను కడతేర్చాడు ఓ ఉన్మాది భర్త. రెండు వారాల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గురుగ్రామ్‌కి చెందిన రాజేష్ శృంగారం కోసం భార్యను ఎప్పుడూ ఒత్తిడి పెట్టేవాడు. ఇల్లు చిన్నదిగా ఉండటంతో పాటు మామ కూడా పక్క గదిలో ఉండడం వల్ల ఆమె అందుకు నిరాకరించేది. దీంతో ఆమెపై అసంతృప్తిగా ఉన్న రాజేష్ ఆమెతో ఎలాగైనా సమయాన్ని గడపాలని సరికొత్త ప్రణాళిక వేసాడు. 
 
సమీపంలోని స్నేహితుడు ఒకరు విహారయాత్రకు వెళ్లేందుకు సిద్ధమవడంతో రాజేష్ ఆ ఇంటి తాళాలు తీసుకున్నాడు. భార్యతో పాటుగా స్నేహితుని ఇంటికి వెళ్లిన రాజేష్ ఆమెతో గొడవ పడ్డాడు. ఆమెకు మరొకరితో వివాహేతర సంబంధం ఉండటం వల్లే తను ఇలా చేస్తోందని భార్యపై మండిపడ్డాడు. దీంతో గొడవ కాస్తా పెద్దదైంది. 
 
ఆవేశంలో రాజేష్ భార్యను చంపేసి గదిలోని మంచం కింద ఉన్న బాక్స్‌లో శవాన్ని దాచిపెట్టి వెళ్లిపోయాడు. విహారయాత్ర నుండి వచ్చిన రాజేష్ స్నేహితుడు ఇది గమనించలేదు. అయితే నాలుగు రోజుల తర్వాత దుర్వాసన రావడంతో, మంచం కింద ఉన్న బాక్స్ ఓపెన్ చేసి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. పోలీసులకు సమాచారం చేరవేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో రాజేష్‌ను అరెస్ట్ చేసారు.