శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Modified: శనివారం, 28 మార్చి 2015 (08:25 IST)

రూ. 1.28 కోట్లతో ఏటిఎం వ్యాన్ డ్రైవర్ పరార్

ఏటిఎంలు బద్ధలు కొడుతున్న దొంగలతోనే బ్యాంకులు భీతుల్లుతుంటే వారికి వ్యాన్ డ్రైవర్లు, సెక్యూరిటీలు కొత్త తలనొప్పి తెచ్చిపెడుతున్నారు. కోట్టాది రూపాయల క్యాష్ ఉన్న వ్యాన్లతో పరారవుతున్నారు. తాజాగా మహరాష్ట్రలో ఓ ఏటిఎం వ్యాను డ్రైవరు 1.28 కోట్ల పరారయ్యాడు. దీనిపై బ్యాంకు ఏటిఎం నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. వివరాలిలా ఉన్నాయి. 
 
వాణిజ్య రాజధాని ముంబైలో శుక్రవారం వెలుగుచూసింది. నవీ ముంబైలోని 'లాగీ క్యాష్'అనే సంస్థ సదరు బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుని  ఏటీఎంలలో క్యాష్ ను జమ చేస్తుంది. ఆ క్యాష్ ను ఒక వ్యాన్ లో ఏటీఎంలకు తరలించడమే ఆ సంస్థ పని. అయితే లాగీ క్యాష్ లో పనిచేసే అమర్ సింగ్  అనే డ్రైవర్ క్యాష్ పై కన్నేశాడు.
 
ఆ రోజు కోటి రూపాయలకు పైగా ఏటీఎంలలో జమచేయాల్సింది. ఆ క్రమంలోనే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంకు ఆ వ్యాన్ చేరింది. అక్కడ రూ.16లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంది. క్యాష్ ను ఏటీఎంలో పెట్టడానికి సెక్యూరిటీ గార్డు ఏటీఎం మిషన్ ను డౌన్ చేశాడు. అప్పటికే బయట నిలుచుని ఉన్న ఆ డ్రైవర్ ఇదే అదునుగా భావించి అక్కడ నుంచి ఉడాయించాడు. 
 
రూ. 1.28 కోట్ల నగదు ఉన్న ఆ వ్యాన్ తో డ్రైవర్ తీసుకుని పారిపోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.