జైపూరులో ఘోరం: బైకర్లపై దూసుకెళ్లని ఎస్‌యూవీ కారు.. నలుగురు మృతి
జైపూరులో ఘోరం జరిగింది. మద్యం సేవించి కారును నడపడంతో నలుగురు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రాజస్థాన్‌లోని జైపూర్‌లో సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా ప్రమాద సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో ఓ ఎస్‌యూవీ కారు అతివేగంతో రోడ్డుపై నడుస్తున్న పాదచారులపై, బైకర్లపై దూసుకెళ్లింది.
ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలువురికి తీవ్ర గాయాలైనాయి. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా వుందని తెలిసింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ప్రస్తుతం కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడైన కారు డ్రైవర్ నిర్లక్షంగా అతివేగంతో కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.