Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చుక్కేసింది.. కారు నడిపింది.. అడ్డుకున్న పోలీసుకు ముద్దులిచ్చేసింది..

శుక్రవారం, 28 జులై 2017 (16:39 IST)

Widgets Magazine
drunk and drive

అసలే మందు తాగింది. ఆపై ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపాడు. ఇక ఆమెకు ఏం చేయాలో తోచలేదు. అంతే తనను అడ్డుకున్న పోలీసుకు ముద్దులు పెట్టేసింది. ఈ ఘటన కోల్‌కతాలోని ఈస్ట్రన్ మెట్రోపాలిటిన్‌లోని సాల్ట్‌లేక్ సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 30 ఏళ్ల వయస్సున్న ఓ మహిళ ఇద్దరు స్నేహితులతో కలిసి మందు కొట్టి కారు నడుపుతూ వచ్చింది. సాల్ట్ లేక్ సమీపంలోని బైపాస్ రోడ్డు వద్దకు రాగానే కారుపై నియంత్రణ కోల్పోయింది. 
 
ఇంకా ఎదురుగా వెళుతున్న మరో కారును ఢీకొట్టింది. దీంతో కారు డ్రైవర్ బండి దిగి.. తాగి కారు నడుపుతున్న మహిళను కాపాడేందుకు ప్రయత్నించాడు. అయితే తప్ప తాగి బండి నడిపిన మహిళ ఆతని చెంపచెళ్లుమనిపించింది. ఈలోగా పోలీసులు కూడా వచ్చేశారు.
 
తాగిన మైకంలో వున్న మహిళపై కేసు రాసుకుని పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు రెడీ అవుతుండగా, సదరు మహిళ కానిస్టేబుల్‌ను హత్తుకుని ముద్దులతో ముంచెత్తింది. అంతే ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ముద్దుల ద్వారా లంచం ఇవ్వజూపిందని కేసు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

టిటిడి మాజీ ఛైర్మన్ చదలవాడ ఏం చేశారో తెలుసా...?

పదవులను అనుభవించిన తరువాత పార్టీకి ముఖం చాటేయడం ఫ్యాషన్‌గా మారిపోయింది చాలామంది టిడిపి ...

news

నంద్యాల ఉప ఎన్నికల్లో వైసిపి విజయం ఖాయమా...? ఎలా?

త్వరలో జరిగే నంద్యాల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని రాజకీయ ...

news

నా పెళ్లాం నన్ను చూసి ఆపకుండా వెకిలిగా నవ్వుతోంది... అందుకే చంపేశా...

ఉన్మాదమా... క్రూరత్వమా... ఏదయితేనేం అతడు తన భార్యను అత్యంత దారుణంగా చంపేశాడు. ఎందుకో ...

news

పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు రంగు పడింది... పదవి ఊడుతోంది... ఎందుకు?

పాకిస్తాన్ దేశ ప్రధానులు పదవిలో వుండగానే ఏదో ఒక ఉపద్రవం ముంచుకొచ్చి వారి పదవి వూడుతుంది. ...

Widgets Magazine