సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 3 మే 2019 (11:16 IST)

ఏనుగును హత్తుకుని ముద్దివ్వబోయిన యువకుడు.. చివరికి?

స్నేహితులతో కలిసి ఫూటుగా తాగాడు. ఏనుగుకు ముద్దిస్తానని వెళ్లాడు. చివరికి ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. కన్నడ సినిమాలో ఏనుగుకు ఓ హీరో ముద్దివ్వడం ఫేమస్ లాగుంది. ఈ సీన్ చూశాడో ఏమో కానీ.. బెంగళూరుకు చెందిన రాజు అనే 24 ఏళ్ల యువకుడు.. ఏనుగుకు ముద్దివ్వాలనుకున్నాడు. 
 
ఇందుకోసం స్నేహితులతో కలిసి అటవీ ప్రాంతానికి వెళ్లాడు. ఇందుకోసం కర్ణాటక- తమిళనాడు సరిహద్దుల్లోని అటవీ ప్రాంతానికి వెళ్లాడు. ఇంకా స్నేహితులతో కలిసి ఫూటుగా తాగిన ఆ యువకుడికి.. ఏనుగుల గుంపు కనిపించింది. ఏనుగులు కనిపించగానే ఆ యువకుడు ఏనుగుకు ముద్దిచ్చేందుకు ఎగబడ్డాడు. అయితే స్నేహితులు ఆ యువకుడిని అడ్డుకున్నారు. 
 
అయినా వారి మాటలు పట్టించుకోని యువకుడు ఏనుగుల గుంపులోకి వెళ్లాడు. ఓ ఏనుగును హత్తుకుని.. ముద్దివ్వడం ప్రారంభించాడు. కానీ ఆ ఏనుగు ఏమనుకుందో ఏమో కానీ.. ఆరు ఏనుగులు కలిసి రాజును ఆడుకున్నాయి.


తొండం పైకి లేపి దూరంగా విసిరాయి. దీంతో తీవ్ర గాయపడిన రాజు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.