గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 అక్టోబరు 2021 (08:42 IST)

లడఖ్‌లో స్వల్ప భూకంపం... రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదు

దేశంలోని కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకటైన లడఖ్‌లో స్వల్పంగా భూమి కంపించింది. లడఖ్‌లోని లేహ్‌లో గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత 12.30 గంటలకు భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 3.8గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) వెల్లడించింది. 
 
అర్థరాత్రి వేళ భూమి కంపించడం వల్ల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.
 
మరోవైపు, పొరుగు దేశమైన మయన్మార్‌లో కూడా భూమి కంపించింది. గురువారం అర్థరాత్రి 11.58 గంటలకు మయన్మార్‌లోని మోన్యవా ప్రాంతంలో భూకంపం వచ్చింది. దీని తీవ్రత 5.5గా నమోదయిందని ఎన్‌సీఎస్‌ తెలిపింది. అలాగే, జపాన్ కూడా భూమి కంపించిన విషయం తెల్సిందే.