1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 4 జనవరి 2017 (13:10 IST)

మోగిన ఎన్నికల నగారా.. ఈవీఎంలలో అభ్యర్థుల ఫోటోలు.. ఓటు ఎవరికి వేశామో తెలుసుకోవచ్చు

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. బుధవారం మధ్యాహ్నం సీఈసీ మీడియా సమావేశంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నజీమ్ అహ్మద్ జైదీ వివరాలను వెల్లడించారు. బుధవారం నుంటే ఈ ఎన్నికల నియామవళి అందుబాటులోకి రా

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. బుధవారం మధ్యాహ్నం సీఈసీ మీడియా సమావేశంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నజీమ్ అహ్మద్ జైదీ వివరాలను వెల్లడించారు. బుధవారం నుంటే ఈ ఎన్నికల నియామవళి అందుబాటులోకి రానుంది. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లో ఎన్నికలు జరగనున్నాయి.
 
* ఉత్తర్ ప్రదేశ్‌లో మే నెలలో ఎన్నికలు.
* మణిపూర్, గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో మార్చి 18న ఎన్నికలు.
* ఉత్తరాఖండ్‌లో మార్చి 26న ఎన్నికలు.
* యూపీలో 403, పంజాబ్ 117, ఉత్తరాఖండ్ 70, మణిపూర్ 60, గోవాలో 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
 
5 రాష్ట్రాల్లో 690 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని, ఐదు రాష్ట్రాల్లో 16 కోట్ల మంది ఓటర్లున్నారు. ఎన్నికల్లో భాగంగా లక్షా 85వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు నజీమ్ ప్రకటించారు. 
 
ఇక ఓటర్ల స్లిప్పులను ఎన్నికల సంఘమే పంపిణీ చేస్తుందని, ఈవీఎంలో తొలిసారిగా ఫొటోలతో అభ్యర్థుల జాబితా వుంటుందన్నారు. కొన్ని చోట్ల మహిళలకు, వికలాంగులకు ప్రత్యేక పోలింగ్ కేంద్రాలుంటాయని, ఎవరికి ఓటు వేశామో తెలుసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు చెప్పారు. 
 
అభ్యర్థుల అఫిడవిట్‌లో కొన్ని మార్పులు చేశామని ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ పత్రాలతో పాటు నో డిమాండ్ సర్టిఫికేట్ ఇవ్వడం తప్పనిసరి అని నజీమ్ అహ్మద్ జైదీ వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో పర్యావరణ హిత సామాగ్రి వాడాలని పేర్కొన్నారు.