ఇది సర్కార్ సృష్టించిన నరమేధం : శివసేన

శనివారం, 30 సెప్టెంబరు 2017 (08:44 IST)

stampede

దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఎల్ఫిన్‌స్టన్ రైల్వే స్టేషన్ వద్ద శుక్రవారం పాదచారుల వంతెన కూలడంతో జరిగిన తొక్కిసలాటపై రాజకీయ పార్టీల నేతలు తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా బీజేపీ మిత్రపక్షం శివసేన మండిపడింది. ఇది ప్రభుత్వం జరిపిన ఊచకోత అని ఘాటుగా పేర్కొంది. 
 
ఈ ప్రమాదానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని మహారాష్ట్రలోని విపక్షాలు మండిపడ్డాయి. బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై దృష్టి పెట్టడానికి బదులు రైల్వే స్టేషన్లలో కనీస వసతులు కల్పించి, ప్రయాణికుల భద్రత మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని సూచించాయి. 
 
ఇదే అంశంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందిస్తూ... ఇది ప్రభుత్వం, రైల్వేలు జరిపిన నరమేధం. పాతకాలం నాటి, శిథిలమైన పాదచారుల వంతెనలను ఆధునీకరించాలని ఎన్నిసార్లు కోరినా చర్యలు తీసుకోలేదు. రైల్వే వ్యవస్థలో లోపాలను సరిదిద్దేందుకు ప్రభుత్వానికి సమయం లేదు. కానీ బుల్లెట్ రైళ్లను తీసుకొస్తానంటున్నది. ఇది సిగ్గుచేటు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలని కోరారు. దీనిపై మరింత చదవండి :  
Massacre Mumbai Stampede Shiv Sena Elphinstone Railway Station Stampede

Loading comments ...

తెలుగు వార్తలు

news

శృంగారంలో పాల్గొని వ్యభిచారిణులకు డబ్బులిస్తే నేరం.. ఎక్కడ?

సాధారణంగా నిరాశ్రయులైన కొందరు మహిళలు డబ్బు కోసం వ్యభిచారం చేస్తుంటారు. ఈ వ్యభిచారం పలు ...

news

డాక్టర్ ఘజల్ శ్రీనివాస్‌కు జ్ఞాన సరస్వతి పురస్కారం

ప్రఖ్యాత ఘజల్ గాయకులు, ముమ్మారు గిన్నీస్ ప్రపంచ రికార్డుల విజేత, స్వచ్ఛ ఆంధ్రా బ్రాండ్ ...

news

కోర్టు ఆవరణలో మోసగత్తె బిడ్డకు పాలిచ్చిన మహిళా పోలీస్... ఫోటో వైరల్...

బిడ్డ పాల కోసం ఏడుస్తుంటే ఏ కన్నతల్లి హృదయమైనా కరిగిపోతుంది. అదే ఇక్కడా జరిగింది. చైనాలో ...

news

టిటిడి పాలకమండలి సభ్యుడిగా కమెడియన్ వేణు మాధవ్?

నంద్యాల ఉపఎన్నికల్లో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏకేసిన వేణుమాధవ్‌ను ...