బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 26 ఏప్రియల్ 2023 (08:28 IST)

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ ఇకలేరు..

prakash singh badal
పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదుసార్లు పనిచేసిన ప్రకాశ్ సింగ్ బాదల్ ఇకలేరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా ఆదివారం ఆస్పత్రిలో చేరిన ఆయన మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఆయనకు వయసు 95 సంవత్సరాలు. మొహాలీలోని ఓ ప్రేవైటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన పంజాబ్ రాష్ట్రానికి ఐదుసార్లు ముఖ్యమంత్రిగా ఈ అకాలీ దళ్ శిరోమణి నేత పనిచేశారు. 
 
ఈయన 1970-71, 1977-80, 1997-2002, 2007-2017 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. పైగా, పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అత్యంత పిన్న వయుసులోనే ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. ఈయన గత యేడాది జూన్ నెలలో ఆస్పత్రి పాలయ్యారు. కరోనా తదనంతర పరీక్షల కోసం గత యేడాది ఫిబ్రవరి నెలలోనూ ఆస్పత్రికి వెళ్ళారు. ప్రకాశ్ సింగ్ బాదల్ మృతి పట్ల పలువురు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నారు.