శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : బుధవారం, 27 మే 2015 (18:42 IST)

వందేళ్లలోగా ఎవరెస్టు హిమానీనదాలు అదృశ్యం... పరిశోధకులు హెచ్చరిక..

ప్రఖ్యాతిగాంచిన ఎవరెస్టు హిమానీనదాలు వందేళ్లలోపే అదృశ్యమవుతాయని ప్రపంచ దేశాల పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయాన్ని నెదర్లాండ్స్, నేపాల్, ఫ్రాన్స్ పరిశోధకులు వెల్లడించారు. వాతావరణంలో ఉష్ట్రోగ్రతలు భారీ స్థాయిలో పెరిగిపోతుండడం వలన హిమానీనదాలు కరిగి, కనిపించకుండా పోయే ప్రమాదం పొంచి ఉందని వారు అంటున్నారు. 
 
1977-2010 మధ్య కాలంలో నేపాల్ లోని హిమానీనదాలు మూడో వంతు తరిగిపోయాయన్న చేదు నిజాన్ని వారు ఉదాహరణగా చెబుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితో వందేళ్లలోపు ఎవరెస్ట్ హిమానీనదాలు మాయమవుతాయని వారు హెచ్చరిస్తున్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించుకోగలిగినప్పటికీ, 70 శాతం వరకు గ్లేసియర్స్ కుచించుకుపోతాయని పరిశోధకులు వెల్లడించారు.