గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 జులై 2022 (14:07 IST)

నుపుర్ శర్మపై సుప్రీం ఫైర్ - దేశ ప్రజలకు సారీ చెప్పాలంటూ ఆదేశం

Nupur sharma
భారతీయ జనతా పార్టీకి చెందిన మాజీ మహిళా నేత, మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గట్టిగా కూడా మందలించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తనపై నమోదైన కేసులను ఢిల్లీకి బదిలీ చేయాలని కోరుతూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశఆరు. పైగా, తనకు బెదిరింపులు ఎక్కువ అవుతున్నాయని విన్నపించింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 
 
జస్టిస్ సూర్యకాంత్, జేపీ పార్థీవాలా ఈ కేసుపై విచారిస్తూ నుపుర్ శర్మను చీవాట్లు పెట్టింది. ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో దేశంలో ఒకరకమైన అలజడి వాతావరణం నెలకొందని మండిపడింది. అందువల్ల మీడియా ముఖంగా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. అలాగే, సదరు టీవీ యాజమాన్యం కూడా సారీ చెప్పాలని ఆర్డర్స్ పాస్ చేసింది. 
 
పైగా, ఇలాంటి వ్యాఖ్యలుచేస్తూ ఆమె లాయర్ అని చెప్పుకోవడం సిగ్గుచేటని ఘాటుగా వ్యాఖ్యానించింది. నుపుర్ శర్మ పాల్గొన్న చర్చాకార్యక్రమాన్ని తాము పూర్తిగా వీక్షించినట్టు ధర్మాసనం వెల్లడించింది. ఈ కేసు విచారణ సందర్భంగా మణిందర్ సింగ్ సుప్రీంకోర్టుకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కోర్టు మాత్రం వాటిని పట్టించుకోలేదు.