Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

టెన్త్ పరీక్షలు రాస్తే ఇంటర్‌లో ఏ గ్రేడ్‌లో ఉత్తీర్ణత.. హౌ? ఇది మాజీ సీఎంకే చెల్లుతుంది!

శనివారం, 20 మే 2017 (15:46 IST)

Widgets Magazine
om prakash choutala

సాధారణంగా పదో తరగతి పరీక్షలు రాస్తే పదో తరగతిలోనే ఉత్తీర్ణులవుతారు. కానీ, ఇక్కడ పరిస్థితి విరుద్ధం. టెన్త్ పరీక్షలు రాస్తే.. ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణులయ్యారు. అదీ ఏ గ్రేడ్‌లో. మరీ ముఖ్యంగా.. 82 యేళ్ళ వయసులో... ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన రాజకీయ కురువృద్ధుడు. ఇంతకీ ఆ ఘనుడు ఎవరన్నదే కదా మీ సందేహం. ఆయన ఎవరో కాదు ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ అధినేత, హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓ ప్రకాష్ చౌతలా. 
 
హర్యానా రాష్ట్రంలో జరిగిన జూనియర్ బేసిక్ ట్రైనింగ్ ఉపాధ్యాయ నియామకాల కుంభకోణంలో చౌతాలా దోషిగా తేలడంతో ఆయనకు పదేళ్ల జైలు శిక్ష పడింది. దీంతో ప్రస్తుతం ఈయన తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అక్కడ ఉంటూనే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. కానీ, ఆయన ఏ గ్రేడ్‌లో ఇంటర్‌లో పాసైనట్టు ఆయన తనయుడు అభయ్ సింగ్ ప్రకటించారు. 
 
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్‌ఐఓఎస్)లో ఓం ప్రకాష్ చౌతలా పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. తన తండ్రి తీహార్ జైలులో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో గత నెల ఎన్‌ఐఓస్ ఇంటర్ పరీక్షలు రాసి పాసయ్యారని, 82 ఏళ్ల వయసులోనూ ఏ గ్రేడ్ సాధించారని చౌతాలా కొడుకు అభయ్ సింగ్ ఇటీవలే మీడియాకు వెల్లడించారు.
 
అయితే చౌతాలా అడ్మిషన్ తీసుకున్నది, పరీక్ష రాసింది పదో తరగతి పరీక్షలని ఎన్‌ఐవోఎస్ అధికారులు స్పష్టం చేశారు. అలాంటప్పుడు ఇంటర్ ఎలా పాసవుతారని కూడా వారు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. పైగా, ఎన్‌ఐఓఎస్ ఆధ్వర్యంలో జరిగిన పది, ఇంటర్ ఫలితాలు ఇంకా వెలువడనే లేదు. మొత్తానికి ఈ తండ్రీ కొడుకుల తెలివితేటల్లో ఒకరిని మించిన మరొకరన్నమాట. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మోడీని జగన్ కలిస్తే టీడీపీ నేతలకు గుబులెందుకు : వెంకయ్య ప్రశ్న

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఒక రాష్ట్రానికి చెందిన విపక్షనేత వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ...

news

మోదీపై మాటలు తూటాలు పేలుస్తున్న పవన్ కళ్యాణ్... చిరంజీవికి కష్టాలు తప్పవా?

ఎందుకో కానీ రూమర్లు అలా తిరుగుతుంటాయి. తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ...

news

మూడు సార్లు ఎమ్మెల్యేనయ్యా.. మర్డర్లు చేస్తామా? : గొట్టిపాటి రవికుమార్

ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురవ మండలం వేమవరం గ్రామంలో ఫ్యాక్షన్ కక్షల్లో ...

news

'దమ్ము, ధైర్యం ఉంటే ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం.. రా' : గొట్టిపాటికి కరణం సవాల్

తెలుగుదేశం పార్టీలోకి కొత్తగా వచ్చిన వారి వల్లే నియోజకవర్గంలో గొడవలు జరుగుతున్నాయని ...

Widgets Magazine