బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2020 (10:21 IST)

‘పద్మ’ అవార్డుల దరఖాస్తుకు గడువు పొడిగింపు

పద్మ అవార్డులకు దరఖాస్తు చేసుకునేందుకు గడువును కేంద్ర ప్రభుత్వం పెంచింది. దరఖాస్తుల గడువును సెప్టెంబర్‌ 15 వరకు పెంచుతూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది.

వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ పురస్కారాలను ఇవ్వనుంది. ఇప్పటివరకు 8,035 దరఖాస్తులు రాగా.. 6,361 దరఖాస్తుల పరిశీలన పూర్తయినట్లు కేంద్రం వెల్లడించింది. 

కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఔత్సాహికులు దరఖాస్తు చేసుకోవడంలో జాప్యం జరుగుతుండడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.