Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఫేస్‌బుక్‌లో గుడ్ బై అంటూ మెసేజ్ పెట్టి.. ఉరేసుకున్న విద్యార్థి.. ఎక్కడ?

శుక్రవారం, 20 జనవరి 2017 (09:50 IST)

Widgets Magazine
Hang

సోషల్ మీడియాతో ప్రయోజనాల విషయాన్ని పక్కనబెడితే నేరాల సంఖ్య మాత్రం అమాంతం పెరిగిపోతోంది. ఫేస్‌బుక్‌లో గుడ్ బై అంటూ మెసేజ్ పెట్టిన ఓ పాఠశాల విద్యార్థి ఇంట్లో సీలింగ్ ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కోల్ కతా నగరంలో చోటుచేసుకుంది. కోల్ కతా నగరానికి చెందిన సంప్రీత్ బెనర్జీ అనే 9వతరగతి విద్యార్థికి అర్థసంవత్సర పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయి.
 
దీంతో మనస్తాపానికి గురైన సంప్రీత్ ఫేస్‌బుక్‌లో గుడ్ బై అంటూ మెసేజ్ పెట్టి ఇంట్లో సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తక్కువ మార్కులు వచ్చినపుడల్లా ఓ టీచరు తన కొడుకును చెవులు పట్టుకొని నిలబడాలని ఆదేశించాడని సంప్రీత్ తల్లి అపర్ణ ఆరోపించారు. టీచరు వేధింపుల వల్లే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు ఆరోపించారు. పోలీసులు పాఠశాలలో పికెట్ ఏర్పాటు చేశారు. సంప్రీత్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

భార్యాభర్తల తగాదాలు.. గోల్డ్ బాబా ఏం చేస్తాడంటే..? తీర్థప్రసాదంలో మత్తమందిచ్చి..?

ఏపీ, తెలంగాణల్లోని ప్రధాన దేవాలయాల వద్ద మకాం వేసి భక్తులను ఆకట్టుకునే బోగస్ బాబా కోసం ...

news

టీడీపీతో అంత గట్టిగా ఎలా మాట్లాడేది: వాపోయిన పవన్

రెండు రోజుల క్రితం పోలవరం రైతులతో సమావేశమైన తర్వాత సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ...

news

సీఎం కేసీఆరా... మజాకా!... అన్ని ఆఫీసులు ఒక్కచోటే... ఎందుకంటే?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ ...

news

మంగళ్‌యాన్‌కు విద్యుత్ కొరత... కక్ష్య మార్పు.. ఫలితమేంటి?

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన అత్యంత విలువైన ప్రాజెక్టుల్లో మంగళ్‌యాన్ ...

Widgets Magazine