Widgets Magazine

పారికర్ కళ్లు పీకేస్తారా?రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఉగ్రదాడులు తప్పవ్: ఫరూక్ అబ్ధుల్లా

శుక్రవారం, 2 డిశెంబరు 2016 (11:51 IST)

Widgets Magazine
pakistan army

జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఒమర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌పై కేంద్ర మంత్రులు విమర్శలు గుప్పిస్తూ, రెచ్చగొట్టడం వల్లే... వాళ్లు నగ్రోటా పట్టణంపై దాడి చేసి, ఏడుగురు సైనికులను హతమార్చారన్నారు. ఈ ఉగ్రదాడికి కేంద్రమంత్రులే కారణమని అన్నారు. 
 
దక్షిణ కశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో జరిగిన పార్టీ సమావేశంలో ఒమర్ మాట్లాడుతూ.. పెద్దనోట్లను రద్దు చేస్తే ఉగ్రవాదం అంతమవుతుందని ఓ వైపు ప్రధాని మోడీ చెబుతున్నారని గుర్తు చేశారు. అయితే అందుకు విరుద్ధంగా ఉగ్రదాడులు పెచ్చరిల్లిపోతున్నాయని ఒమర్ అబ్ధుల్లా ఎద్దేవా చేశారు. 
 
భారత్ వైపు చెడు దృష్టితో చూస్తే కళ్లు పీకేస్తామని రక్షణ మంత్రి పారికర్ చేసిన వ్యాఖ్యలను ఒమర్ తప్పుబట్టారు. రక్షణ మంత్రే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే, నగ్రోటా లాంటి ఉగ్రదాడులు తప్పవని హెచ్చరించారు. 
 
జమ్మూకాశ్మీర్‌లోని టెర్రరిస్టులు తలచుకుంటే ఏమైనా చేయగలుగుతారని, భారత సైన్యమంతా కలిసినా వారిని అడ్డుకోలేరని సీనియర్, మాజీ సీఎం ఫరూక్ అబ్ధుల్లా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీరును ఆ దేశానికి వదిలేయాలంటూ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఫరూక్ మరోసారి తన కామెంట్స్‌తో వేడి పుట్టించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Farooq Abdullah Comments On Border Terror Attacks

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఖాతాదారులకు మజ్జిగ, మంచినీరు.. ఆ ఘటనపై క్షమాపణ చెప్తున్నా: డీజీపీ

పెద్ద నోట్ల రద్దుతో ఆంధ్రప్రదేశ్‌‌లో నోట్ల కష్టాలు తీవ్రమయ్యాయి. బ్యాంకులు, ఏటీఎంలలో ...

news

సంపన్న మహిళకు బెదిరింపులు.. రూ.2కోట్లు ఇవ్వకపోతే.. ఆ ఫోటోలను పోర్నోగ్రాఫిక్ సైట్లలో?

మహిళలపై అఘాయిత్యాలు, వేధింపులు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా భోపాల్‌లో ఓ మహిళ తీవ్ర ...

news

నోట్ల రద్దు కష్టాలు: మోడీ మారు వేషంలో వచ్చి.. ఇడ్లీతిని.. టీతాగి చూడాలి.. కష్టమేమిటో

ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి పూర్వం రాజులు మారు వేషాల్లో వెళ్లినట్లే.. ప్రస్తుతం ప్రధాన ...

news

బీజేపీకి బైబై చెప్పేసి వామపక్షాలతో దోస్తీకి పవన్ కల్యాణ్ రెఢీ.. 2019 ఎన్నికలే లక్ష్యం..?!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పెషల్ స్టేటస్‌పై బీజేపీ సర్కారు వ్యవహరించిన తీరుపై ...